వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత కేసుల విచారణలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు: కేంద్రం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పాత కేసుల విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సీబీఐ ఆయా రాష్ట్రాల్లో కేసులను విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ పరిధిపై మరోసారి కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే సీబీఐ విచారణ చేస్తున్న కేసుల విషయంలో అధికారులను అడ్డుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చి చెప్పింది కేంద్రం.

ఢిల్లీ పోలీసు చట్టంలో కేంద్రం చేసిన సవరణలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేసుల దర్యాప్తు విషయంలో ఇటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ, అటు రాష్ట్రాల్లో కానీ సీబీఐకు దర్యాప్తు చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసు చట్టం కింద ఏ దర్యాప్తుకైనా ప్రత్యేక విచారణ సంస్థను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉందని తెలిపింది.

No need of early permission from State govts while probing old cases: Centre

సెక్షన్ -3 కింద పొందుపరిచిన నేరాలకు మాత్రమే పరిమితం కాకుండా సెక్షన్ -5లోని అంశాలను కూడా దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంటుంది. ఇక ఓ కేసుకు సంబంధించి న్యాయస్థానాలు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆ విచారణను అడ్డుకునే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని చెప్పిన కేంద్రం.... కేసులను స్వేచ్ఛగా దర్యాప్తు చేసే హక్కు అధికారం సీబీఐకి ఉందని గుర్తుచేసింది.

ఇదిలా ఉంటే ఈ మధ్యే పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంకు సంబంధించి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను సిట్ అధికారిగా ఉన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ధ్వంసం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే రాజీవ్‌కుమార్‌కు రక్షణగా నిలిచారు. సీబీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం దేశం దృష్టిని మరల్చింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గడ్డపై సీబీఐ అడుగుపెట్టరాదంటూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం మరోసారి సీబీఐ పరిధిని స్పష్టం చేసింది.

English summary
CBI has all the powers to investigate a case and that it doesn't require any state government's permission to enquire the old cases clarified Centre.The centre made an attempt to clarify the Delhi Police Act and the changes that were made in the act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X