సిద్ధరామయ్య కుర్చీకి ఎసరు?: మొయిలీ ఎంట్రీతో రసవత్తరం
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తోన్నారు. బాహటంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతు పలుకుతున్నారు.
కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన వేదికను పంచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయాల్లో ఓ చిన్న సైజు సునామీని లేవదీసింది.

ఇది అక్కడితో ఆగలేదు. దీనికి కొనసాగింపు సైతం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్దుకోలేరంటూ ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని రేపింది.
డీకే శివకుమార్‌లో మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు. జనం ఏవేవో చెప్పుకొంటోన్నారు గానీ ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కావడం డీకేశికి బహుమతిగా ఇవ్వాల్సింది కాదని కష్టపడి సంపాదించినదని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై డీకే శివకుమార్ సైతం తాజాగా స్పందించారు. వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారనేది తెలియదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు డీకేశి. పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, దీనికోసం పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, బూత్ స్థాయిలో కమిటీలతో సమావేశం కానున్నానని చెప్పారు.
వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ మొయిలీ చెప్పలేదని, ఏదో ఒక రోజు సీఎం అవుతాడనే అన్నాడని గుర్తు చేశారు. కష్టపడి పని చేసినందుకు డీకేకు రివార్డ్ దక్కడం ఖాయమేనని, ఈ విషయాన్ని ఖరారు చేయాల్సింది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు.
ప్రస్తుతానికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమేనని, ముఖ్యమంత్రి ఎవరనేది మీడియా ముందు నిల్చొని నిర్ణయించేది కాదని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. పార్టీ, ప్రజల కోసం కష్టపడి పని చేసిన వాళ్లకు ఏదో ఒక రోజు రివార్డు దక్కుతుందని అన్నారు. వీరప్ప మొయలీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications