ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 'ఒక్కరూ కాపాడాలనుకోలేదు'
చెన్నై: తన కూతురును చంపేస్తుంటే కాపాడేందుకు ఒక్కరు కూడా రాలేదని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో హత్యగావించబడ్డ ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి తండ్రి మంగళవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు పైన దుండగుడు దాడి చేస్తుంటే అక్కడ చూస్తున్న వారు కనీసం స్పందించలేదన్నారు.
హత్యను చూసిన వారిలో కొందరు ఆ తర్వాత రైలుకే వెళ్లిపోయినట్లుగా పోలీసులు చెప్పారని అన్నారు.
తన కూతురిది సున్నితమైన మనస్తత్వం అన్నారు. తన అవయవాలను కూడా దానం చేసిందని చెప్పారు. ఆమె అవయవాలు ఉండి ఉంటే, ఇతరులకు ఇచ్చేవాళ్లమని చెప్పారు.

ఎవరైనా స్పందించి ఉంటే, చనిపోకపోయేదని అభిప్రాయపడ్డారు. ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రాలేదో తనకు తెలియదన్నారు. మనం అలా ఉండటం సరికాదన్నారు. తన కూతురును చంపిన వాడిని తప్పకుండా అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారన్నారు. వారి పైన నమ్మకం ఉందన్నారు. ఆయన ఓ ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడారు.












Click it and Unblock the Notifications