బెంగాల్ పోల్ షెడ్యూల్ కుదింపుపై తకరారు -ఒకే రోజు పోలింగ్ పెట్టాలన్న మమత -మార్పుల్లేవన్న ఈసీ
ఎన్నికల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ కొత్త కేసులు, మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కుదిస్తారని, మిగిలిన ఫేజ్ లను ఏకం చేసి ఒకే రోజు పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బెంగాల్ లో పోల్ షెడ్యూల్ కుదింపు ఆలోచనగానీ, అలాంటి ప్రతిపాదనగానీ తమకు లేవని ఈసీ గురువారం క్లారిటీ ఇచ్చింది. కానీ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం షెడ్యూల్ కుదించాల్సిందేనని కోరారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశానికి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాలని సూచించారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా, శనివారం (17న) ఐదో దశ పోలింగ్ జరుగనుంది. ఆ తర్వాత మరో మూడు దశల పోలింగ్ ఉంటుంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, మిగిలిన విడదతల పోలింగ్‌ను ఏకం చేసి ఒకేసారి నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు రాగా, అలాంటిదేమీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పష్టతనిచ్చింది. కానీ..
పోల్ షెడ్యూల్ లో మార్పులు ఉండవని ఈసీ క్లారిటీ ఇచ్చినప్పటికీ, కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నాలుగు దశల ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎం మమత బెనర్జీ అభ్యర్థించారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఘోరంగా ఉందని, అందుకే ఒకే దశలో నిర్వహించాలని దీదీ అభ్యర్థించారు. ''ఎన్నికలను 8 దశల్లో నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని ఈ పరిస్థితుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకే మిగిలిన ఎన్నికల దశలను ఒకే దశలో నిర్వహించండి. ఇలా చేయడం ద్వారా ప్రజలను కరోనా బారి నుంచి కాపాడిన వారమవుతాం'' అని మమత ట్వీట్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications