జయ ఆప్తుడు: జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది, వెంకయ్యనాయుడు
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన పద్దతి మార్చుకుంటే మంచిదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత క్లిష్టతరం చేసుకోరాదని తాను ఆయ
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన పద్దతి మార్చుకుంటే మంచిదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీన్ రివర్స్: శశికళకు చుక్కలు చూపిస్తున్న అనుచరులు !
ఆదాయ పన్నుశాఖ అధికారుల దాడుల నేపథ్యంలో తొలగింపునకు గురైన రామ్మోహన్ రావు చేస్తున్న ఆరోపణలను వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు తరువాత మీడియాతో మాట్లాడారు.

రామ్మోహన్ రావు వ్యవహారంలో ఎలాంటి రాజకీయ జోక్యం జరగలేదని స్పష్టం చేశారు. రామ్మోహన్ రావు చేసిన భాద్యతారహిత వ్యాఖ్యలను తాను స్పందించనని అన్నారు. రామ్మోహన్ రావు ఇంటిలో ఏమీ దొరకలేదంటే చట్టం ఉంది కదా, ఆయన దాని సాయం తీసుకోవచ్చు కదా ? అని వెంకయ్యనాయుడు చెప్పారు.
జయలలితకు నమ్మక ద్రోహం: రూ.300 కోట్ల గోల్ మాల్ !
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ రావును సర్వీసుల నుంచి తొలగించలేదని, ఆయన స్థానంలో వేరే అధికారిని నియమించారనే విషయం తాను మీడియాలో చూశానని అన్నారు. ప్రజావ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలన్నదే మా ఉద్దేశం అని వెంకయ్యనాయుడు చెప్పారు.
తమిళనాడులో ఎమైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేరుగా కేంద్రంతో మాట్లాడుతారని అన్నారు. రామ్మోహన్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత క్లిష్టతరం చేసుకోరాదని తాను ఆయనకు ఇచ్చే సలహా అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరోక్షంగా హెచ్చరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications