'బీజేపీతో కలిస్తే రజనీని వ్యతిరేకిస్తాం', పార్టీ గుర్తు, సింబల్‌పై ఇప్పుడే కాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపితే తాము వ్యతిరేకిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరాసర్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

  రజనీకాంత్ వెనకడుగు :బాబా ముద్రలో ని తెల్లటి తామరపువ్వు తొలగించడానికి కారణం !

  ఆయన బీజేపీతో చేతులు కలుపుతారని, బీజేపీకి అండగా నిలుస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తిరునావుక్కరాసర్ స్పందించారు.

  No Rajini’s new decision on party, symbol this January

  తమిళనాడులో అన్నాడీఎంకే పాలన పోవాలని, డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కొనసాగుతుందని, రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి సగౌరవంగా స్వాగతిస్తున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ స్వయంగా పోటీ చేస్తారా లేకపోతే ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అన్నది వేచి చూడాలని వ్యాఖ్యానించారు.

  కానీ రజనీ బీజేపీతో చేతులు కలిపితే మాత్రం కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందని చెప్పారు. మరోపక్క పార్టీ పేరును, గుర్తును ఇప్పట్లో వెల్లడించే అవకాశం లేదంటున్నారు రజనీకాంత్. సంక్రాంతి సందర్భంగా పార్టీ పేరు, గుర్తును వెల్లడిస్తారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఆ ప్రచారాన్ని రజనీ తోసిపుచ్చారు. బాబా ముద్ర పార్టీ గుర్తుగా ఉంటుందని వస్తున్న వార్తలను కూడా ఖండించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Fans of actor Rajinikanth may have to wait a little longer to know the name of his political party and symbol.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X