సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణలో చంద్రబాబు ప్రస్తావన

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

కేజ్రీవాల్ జ్యడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయన కస్టడీని పొడిగించాలంటూ రోస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు తన వాదనలను వినిపించారు. వాదనలను విన్న అనంతరం ఈ నెల 20వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది న్యాయస్థానం.

No releaf for Arvind Kejriwal in Supreme Court and Delhi HC extends his Judicial custody till May 20

అటు దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి.

ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఎన్నికలను కారణంగా చూపించి, ఒక రాజకీయ పార్టీకి జాతీయ కన్వీనర్ కావడం వల్ల ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలనడం సరికాదని అన్నారు. రాజకీయ నాయకులు కూడా సాధారణ ప్రజలేనని వారిని ప్రత్యేకంగా చూడనక్కర్లేదని పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తే- ముఖ్యమంత్రిగా ఆయనఎటువంటి అధికారిక విధులను నిర్వర్తించకూడదని బెంచ్ పేర్కొంది. ఎన్నికల కారణంగా మధ్యంతర బెయిల్ ఇస్తే- ముఖ్యమంత్రి హోదాలో ఆయన విధులకు హాజరవుతారని, అది మద్యం పాలసీ కుంభకోణం విచారణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని న్యాయమూర్తులు చెప్పారు.

ఇది సరికొత్త వివాదానికి దారితీస్తుందని, ప్రభుత్వ విధుల్లో న్యాయస్థానం జోక్యం చేసుకున్నట్టలవుతుందని వ్యాఖ్యానించారు. అలా జరగాలనుకోవట్లేదని అన్నారు. గతంలో రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామి కేసులో కోర్టు ఎలాంటి వైఖరిని అనుసరించిందో ప్రస్తావించారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ను బెయిల్ ఇవ్వడం అనేది ఒక చెడు సంప్రదాయానికి దారి తీస్తుందని, దీన్ని ఉదాహరణగా చూపించి, భవిష్యత్తులో మరికొందరు ఇలాంటి మినహాయింపులను కోరుతారని తుషార్ మెహతా అన్నారు. రాజకీయ నాయకులకు బెయిల్ ఇవ్వడం ఓ సంప్రదాయంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

No releaf for Arvind Kejriwal in Supreme Court and Delhi HC extends his Judicial custody till May 20

విచారణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఉదంతం సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో చంద్రబాబు నాయుడ, ఒడిశాలో శివశంకర్ దాస్ కేసునూ ఆయన గుర్తు చేశారు. శివశంకర్ దాస్ ప్రచారం చేయకూడదనే షరతుతో దిగువ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని అన్నారు.

ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు కేసు ఇలాంటిదేనని చెప్పారు. ప్రెస్ ఇంటర్వ్యూలను ఇవ్వడానికి ఆయనకు అనుమతి లభించిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపును కల్పించట్లేదని, సార్వత్రిక ఎన్నికలకు గడువు ఉన్నందు వల్ల ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు చెప్పారు. అనంతరం విచారణను గురువారం లేదా వచ్చే వారానికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+