బెయిల్ కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూపులు
Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ అదుపులో ఉన్నారామె. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈడీ కస్టడీకి తరలించింది ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు వాదోపవాదాలను ఆలకించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు, కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు. అప్పీల్ పిటీషన్‌కు ఎలాంటి కాపీలను కూడా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఈడీ అధికారులకు చివరి నిమిషంలో అందజేశారని అన్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ వాదనలను విన్నారు. దీనికి కౌంటర్ పిటీషన్‌ను ఫైల్ చేయడానికి ఈడీ అధికారులకు కొంత సమయం కావాలని ఎస్ వీ రాజు విజ్ఞప్తి చేశారు. పాయింట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వెల్లడించడానికి గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం బెయిల్ పిటీషన్లపై విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీని కూడా వారు స్తంభింపజేశారు. మై భీ అరవింద్ కేజ్రీవాల్ హూ అని రాసి ఉన్న పసుపురంగు టీ షర్టులను ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలు, సచివాలయాల వద్ద ఆప్ నాయకులు ధర్నాలకు దిగారు.












Click it and Unblock the Notifications