పండగల పేరుతో ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దు, వచ్చేది శీతకాలం: హర్షవర్ధన్, వారికే వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే పండగల సీజన్లలో మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారు. అంతేగాక, వచ్చేది శీతాకాలం కావడంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలా ఏ దేవుడూ. ఏ మతమూ చెప్పలేదు..
వచ్చేది శీతకాలమని అంతేగాక, పండగల సీజన్ కావడంతో ప్రజలు కరోనా మహమ్మారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పస్టం చేశారు. భారీగా గుమికూడటం వంటి చేయరాదని సూచించారు. ఆర్భాటంగా పండగలు జరుపుకోవాలని.. వాటి కోసం ప్రాణాలను పణంగా పెట్టాలని ఏ మతం, ఏ దేవుడు చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పండగల నేపథ్యంలో కేంద్రమంత్రి పైవిధంగా స్పందించారు.

వారికే వ్యాక్సిన్ తొలి ప్రాధాన్యం..
సండే సంవాద్ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ మొదటగా ఎవరికి ఇవ్వాలనే విషయంపైనా కేంద్రమంత్రి స్పందించారు. కరోనా ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ వినియోగంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. తొలినాళ్లలో కోవిడ్ వ్యాక్సిన్ పరిమిత మోతాదులోనే అందుబాటులోకి వస్తుందని, అందుబాటులోకి వస్తుందని, అందువల్ల వృత్తిపరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు, ఆరోగ్యరీత్య అధిక ముప్పు ఉన్నవారికి, మరణం ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

త్వరలో విభిన్న రకాల వ్యాక్సిన్లు
దేశంలో త్వరలోనే విభిన్న రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో కొన్ని నిర్ధిష్ట వయస్సు గలవారికే పనికొస్తాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా టీకాలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ 1,2,3 దశల్లో ఉన్నాయని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు.
Recommended Video

ఎక్కువ టీకాల అవసరం
భారత్ లాంటి పెద్ద దేశంలో వ్యాక్సిన్ అవసరాలను ఒకే సంస్థ తీర్చలేదని.. జనాభా అవసరాలకు తగ్గట్లుగా సాధ్యమైనన్ని ఎక్కువ టీకాలను అనుమతించడానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ నిర్ధారణ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన పెలూదా పరీక్షను కొద్ది వారాల్లో ప్రవేశపెడతామని హర్షవర్దన్ తెలిపారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 70 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 8లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. లక్షకుపైగా మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications