"కాక్రోచ్ ల పిలుపుతో సంబంధం లేదు"- ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా షాకింగ్ ..!

ఢిల్లీ నిరసనల సందర్భంగా అక్టోబర్ 16న తనను నిర్బంధించిన అనంతరం పోలీసులు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (AISA) అధ్యక్షురాలు నేహా బోరా (Neha Bora) దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తాను కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపులో పాలుపంచుకోలేదని వాదనల సందర్భంగా ఆమె తేల్చిచెప్పేశారు. ఆమె ఎలాంటి నేరం చేయలేదని గానీ, శాంతిభంగంగా పరిగణించబడే ఏ కార్యకలాపంలోనూ పాల్గొనలేదని గానీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తీర్పును రేపు సాయంత్రానికి కోర్టు రిజర్వు చేసింది.

జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!
జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!

ఢిల్లీ నిరసనల కేసులో 10 వేల పూచీకత్తుపై సంతకం చేయాలని, శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశిస్తూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ నేహా బోరా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 16న మండి హౌస్ వైపు పాదయాత్ర చేస్తుండగా నిర్బంధించి, విడుదల చేసిన ఒక రోజు తర్వాత అక్టోబర్ 18న నేహాకు ఈ నోటీసు పంపారు. జంతర్ మంతర్ ను నిరసనల ప్రాంతంగా డీనోటిఫై చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్లేలా జనాన్ని రెచ్చగొట్టిందని, అలాగే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ కన్నాట్ ప్లేస్‌కు వెళ్లమని కూడా రెచ్చగొట్టారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి.

No Role in CJP Protest Call Neha Bora Tells Delhi HC as Court Reserves Verdict on Peace Bond Notice
అభిజీత్ దిప్కే, నేహా బోరాల నిర్బంధంపై విపక్షాల ఫైర్..! ఎవరేమన్నారంటే..!
అభిజీత్ దిప్కే, నేహా బోరాల నిర్బంధంపై విపక్షాల ఫైర్..! ఎవరేమన్నారంటే..!

దీంతో బోరా తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్.. అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం మండి హౌస్‌కు చేరుకున్న కేవలం 10 నుంచి 15 నిమిషాలకే ఆమెను అదుపులోకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఆ రోజున ఆమె శాంతిభంగంతో సహా ఎలాంటి నేరం చేయలేదని వాదించారు. సాయంత్రం 5 గంటలకు మండి హౌస్‌లో సమావేశం గురించి ప్రకటిస్తూ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను ప్రస్తావిస్తూ.. ఆ పోస్ట్‌లో కేవలం ఈరోజు సాయంత్రం 5 గంటలకు కలుద్దామని మాత్రమే ఉందన్నారు.
ఆ పోస్ట్‌లో హింసకు పిలుపు, ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రయత్నం లేదా నేరం చేయడానికి సమావేశం కావాలని ఆహ్వానం వంటివి ఏవీ లేవని గుర్తుచేశారు. నోటీసులో పేర్కొన్న కారణాలను ప్రస్తావిస్తూ జారీ చేసిన అసలు ఉత్తర్వులో ఈ అంశాలలో ఏవీ చేర్చలేదన్నారు. బోరా కార్యకలాపాలు శాంతియుతంగానే ఉన్నాయని వాదించారు. ప్రభుత్వ మార్పుపై ఆమె చేసిన వ్యాఖ్యలపై వాదిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం మారడంలో తప్పేముందని శంకరనారాయణన్ అడిగారు. దీనిని కేంద్రం వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం మారడం అనేది కేవలం ఓట్ల ద్వారా మాత్రమే జరగాలని, ఢిల్లీ నడిబొడ్డున అరాచక శక్తుల ద్వారా కాదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+