అబ్బే అదేం లేదు.. కరోనా వ్యాక్సిన్‌తో వంధ్యత్వమా..? వైద్యరోగ్యశాఖ క్లారిటీ
కరోనా టీకాతో పురుషుల్లో లేదా మహిళల్లో వంధ్యత్వం వస్తుందని చెప్పిడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఇటువంటి అసత్యప్రచారాలు వదంతులు పోలియో టీకా కార్యక్రమంలోనూ వెలుగుచూసిన విషయాన్ని ప్రస్తావించింది. టీకాలు సురక్షితమైనవే కాకుండా వ్యాధిని నిరోధించడంలో మంచి ప్రభావం కనబరుస్తాయని కూడా కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అందుబాటులో ఉన్న టీకాల ప్రభావాలను జంతువుల్లో పరీక్షించి ప్రమాదం లేదని తేల్చాకే మనవ వినియోగంలోకి వచ్చాయని పేర్కొంది. వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన నిపుణులు కమిటీ కూడా గతంలో ఇదే సూచన చేసింది. బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా కరోనా టీకా తీసుకోవచ్చని, ఈ విషయంలో ఎటువంటి అనవసర భయాలకు తావు లేదని స్పష్టం చేసింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications