Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Widowers: భార్య చనిపోయిన ఒంటరి పురుషులకు పింఛన్! గ్రామ సభ తీర్మానం

సామాజిక భద్రత అంటే ఇప్పటివరకు మనం ఎక్కువగా మహిళలు, వితంతువులు, నిరుపేద కుటుంబాల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఒక ప్రశ్న ఎప్పుడూ మౌనంగా మిగిలిపోయింది. "భార్యను కోల్పోయి, ఆధారం లేకుండా జీవిస్తున్న పురుషుల పరిస్థితి ఏమిటి?" ఈ మౌనాన్ని ఛేదిస్తూ, మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర అహిల్యానగర్‌ జిల్లా, కోపర్‌గావ్‌ తాలూకా పరిధిలోని సోనేవాడి గ్రామసభ ఒక వినూత్నమైన, సమాజాన్ని ఆలోచింపజేసే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆర్థికంగా బలహీనంగా ఉండి, భార్యను కోల్పోయిన విధురులకు కూడా మహిళా వితంతువుల మాదిరిగానే ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయాలని ఈ తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని కోరింది.

Widowers

ప్రస్తుతం ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం, సంజయ్‌గాంధీ నిరాధార్‌ అనుదాన్‌ యోజన వంటి పథకాల ద్వారా వితంతు మహిళలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అయితే భార్య చనిపోయి జీవనాధారం కోల్పోయిన పురుషుల కోసం మాత్రం ప్రత్యేకమైన, స్పష్టమైన పథకాలు లేవని గ్రామసభ ఆవేదన వ్యక్తం చేసింది.

150 మంది Widowers..

ఈ అంశాన్ని గ్రామసభ ముందుకు తీసుకొచ్చింది సోనేవాడి గ్రామస్థుడైన కిశోర్‌ జవాలే. "సామాజిక న్యాయం లింగ ఆధారంగా ఉండకూడదు. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ సమానంగా భద్రత కల్పించాలి" అనే ఆలోచనతో ఆయన ప్రతిపాదనను సభలో ఉంచారు. సోనేవాడి గ్రామంలోనే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న విధురులు దాదాపు 150 మంది ఉన్నారని ఆయన వెల్లడించారు.

Widowers సామాజిక అసమానతలు

ఈ ప్రతిపాదనపై గ్రామసభ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. పథకాల అమలులో లింగ ఆధారిత వివక్ష కొనసాగితే, అది సామాజిక అసమానతలను మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. చివరికి, విధురులకూ సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందంటూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ గ్రామసభకు అధ్యక్షత వహించిన సర్పంచి శకుంతలా తాయి మాట్లాడుతూ, "సమాజంలో ఎవరు బలహీనులైనా వారికి మద్దతు ఇవ్వడమే నిజమైన న్యాయం. ఇది మహిళల హక్కులను తగ్గించడమేమీ కాదు, పురుషుల అవసరాలను కూడా గుర్తించడం మాత్రమే" అని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ అధికారి భానుదాస్‌ దభాడే ఈ తీర్మానం ప్రతిని సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తామని ప్రకటించారు. సోనేవాడి గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్తులో విధాన రూపకల్పనపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+