'ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలి'
న్యూఢిల్లీ: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలను కనడంపై పరిమితులు విధించాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయంచుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలని అన్నారు.
దేశంలో జనాభా నియంత్రణకు అదే ఉత్తమమైన మార్గమమని, దీనిపై చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు, క్రైస్తవులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోరని తాను అనడం లేదని అందరికీ వర్తించేలా చట్టాన్ని తీసుకువస్తే బాగుంటుదన్నదే తన అభిప్రాయమని తెలిపారు.

దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలంతా ఈ శస్త్రచికిత్సలు చేసుంచుకుని ఉంటే భారత జనాబా ఇప్పుడు 30 కోట్లే ఉండేదని, చేయించుకోకపోడవం వల్లే 130 కోట్లకు చేరిందని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. గతంలో కూడా హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కూడా దేశంలోని ముస్లింలకు ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ముస్లిం మతం తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గురవుతున్నందున ఆ మతస్థులకు ఉన్న ఓటు హక్కును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
అంతేగాక, అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), ఆ పార్టీ నేతలు ఒవైసీ సోదరులు ‘విషపు పాములు' అని, మైనారిటీ మతస్థులను దోచుకునేందుకు విషం చిమ్ముతుంటారని కూడా సామ్నా సంపాదకీయం విమర్శించింది.
ముస్లింలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సంపాదకీయం పేర్కొంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపేదని, ఇప్పుడు ఇతరులు కూడా తమను తాము లౌకికవాదులుగా చెప్పుకుంటున్నారని విమర్శించిన విషయం తెలిసిందే.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications