వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బే.. భారత్ బంద్ లేదు.. ఎప్పటిలాగే డైలీ బిజినెస్.. ట్రాఫిక్ కూడా

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు బంధ్‌కు పిలుపునిచ్చాయి. బంద్ చెదురు మదురు ఘటనలు మినహా.. ప్రశాంతంగా జరిగింది. అయితే సోషల్ మీడియా ట్విట్టర్‌లో మాత్రం.. భారత్ బంద్ జరగలేదని.. అందరూ రెగ్యులర్ కార్యాలయాలు, బయటకు వెళ్లారని కామెంట్ చేసింది. అన్నీ చోట్ల కాదు.. కొన్ని చోట్ల మాత్రం ప్రభావం లేదని తెలిపింది.

సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. వివిధ చోట్ల ఆందోళనలు కొనసాగాయి. రోడ్లను బ్లాక్ చేశారు. భారత్ బంద్ సక్సెస్ అయ్యిందని నేతలు/ రైతు నేతలు ప్రకటించారు. కానీ ట్విట్టర్ మాత్రం చాలా చోట్ల సక్సెస్ కాలేదని తెలిపింది. ఆయా చోట్ల ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో పాల్గొన్నారని.. వారికి ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది.

 NoBharatBandh as normal life remains unaffected in several states:Twitter

ముంబైలో అయితే మాల్స్, షాప్స్ ఓపెన్ ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ కూడా ఎప్పటిలాగే ఉందని పేర్కొనడం విశేషం. మధ్యప్రదేశ్‌లో కూడా బంద్‌పై అంతగా ప్రభావం లేదని మరొ యూజర్ కామెంట్ చేశారు. అలాగే 25 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని స్వరాజ్ అభియాన్ నేత ట్వీట్ చేశారు. కానీ దానిని ఓ యూజర్ ఖండించారు. రైళ్లు నడుస్తోన్న ఫోటోను ట్వీట్ చేశారు. భారత్ బంద్ లేదని.. తాను ఎక్కువసేపు పనిచేశానని మరో యూజర్ తెలిపారు.

కానీ భారత్ బంద్ సక్సెస్ అయిందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులే కొనసాగాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది.

English summary
Bharat Bandh called by farmer unions against the Centre's three agricultural laws evoked a mixed response in many states in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X