సీఎం ఎఫెక్ట్: టీటీవీ దినకరన్, నటుడు సెంథిల్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు: ఏ క్షణంలో !

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు అయ్యాయి.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు అయ్యాయి. అన్నాడీఎంకే పార్టీ ఎంపీ కుమార్ ను బహిరంగంగా అసభ్యపదజాలంతో దూషించారని కేసులు నమోదు చేసిన తిరుచ్చి పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

టీటీవీ దినకరన్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు కావడంతో ఆయన్ను తమిళనాడు పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉండటంతో మన్నార్ గుడి మాఫియాకు టెన్షన్ మొదలైయ్యింది. టీటీవీ దినకరన్ తోపాటు తమిళ హాస్యనటుడు సెంథిల్ మీద కేసులు నమోదు అయ్యాయి.

 Nonbailable case fild against TTV Dinakaran and actor Senthil

తనను కించపరస్తూ తన పేరు ప్రతిష్టలకు భంగంకలిగిస్తూ టీటీవీ దినకరన్, తమిళ హాస్యనటుడు సెంథిల్ బహిరంగంగా అసభ్య పదాజాలంతో దూషించారని తిరుచ్చి ఎంపీ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీవీ దినకరన్, సెంథిల్ దూషిస్తున్న సమయంలో మీడియా తీసిన ఓ వీడియోను ఎంపీ కుమార్ స్థానిక పోలీసులకు ఇచ్చారు.

ఎంపీ కుమార్ ఇచ్చిన వీడియోను పరిశీలించిన పోలీసులు టీటీవీ దినకరన్, హాస్యనటుు సెంథిల్ మీద నాన్ బెయిల్ బుల్ సెక్షలు ఐపీసీ 294(బి), 506 (ఐ), 109, 153 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుచ్చి పోలీసులు చెన్నై చేరుకుని టీటీవీ దినకరన్ ను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. దినకరన్ ఇచ్చే వివరణకు పోలీసులు సంతృప్తి చెందకపోతే అక్కడికక్కడే అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+