వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కోసం ట్రంప్ త్యాగం: మాంసాహారి అయిన అధ్యక్షుడు వెజ్ ఫుడ్‌పై ఆసక్తి.. మెనూ ఇదే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన కోసం నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. స్వతహాగా మాంసాహారి అయిన ట్రంప్ తొలిసారిగా ఒక దేశ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వెజిటేరియన్ ఫుడ్ తీసుకోనున్నారు. భారత్‌లో పర్యటించనున్న ట్రంప్ అహ్మదాబాదులో ఉన్న సమయంలో కేవలం వెజిటేరియన్‌కు మాత్రమే పరిమితం కానున్నారు.

ట్రంప్ భారత్ పర్యటన: ఐటీసీ మౌర్య హోటల్‌లో బస... ఒక్క రాత్రికి ఈ గది ధర ఎంతో తెలుసా..?ట్రంప్ భారత్ పర్యటన: ఐటీసీ మౌర్య హోటల్‌లో బస... ఒక్క రాత్రికి ఈ గది ధర ఎంతో తెలుసా..?

నాన్ వెజ్ ప్రియుడు ట్రంప్ తొలిసారిగా...

నాన్ వెజ్ ప్రియుడు ట్రంప్ తొలిసారిగా...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మంచి నాన్‌వెజ్ ప్రియుడు. మాంసం ముక్క లేనిదే ముద్ద దిగదట. అలాంటిది భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ తొలిరోజు మాత్రం వెజిటేరియన్ ఫుడ్‌ మాత్రమే తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ కూడా శాఖాహారి కావడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .మోడీతో పాటుగానే ట్రంప్‌కు కూడా వెజిటేరియన్ ఆహారం వడ్డించనున్నారు. సాధారణంగా ట్రంప్ కేఎఫ్‌సీ చికెన్, ఫాస్ట్‌ఫుడ్, బర్గర్, డైట్ కోక్‌ తీసుకుంటారు.

ట్రంప్ కోసం స్పెషల్ చెఫ్

ఇక ట్రంప్ అహ్మదాబాద్‌లో ఉన్న సమయంలో ఆయన కోసం ప్రత్యేక వంటకాలు తయారు చేసేందుకు ఫార్చ్యూన్ ల్యాండ్ మార్క్ హోటల్ నుంచి సురేష్ ఖన్నా అనే చెఫ్‌ వచ్చారు. గుజరాత్‌లో ముఖ్య వంటకం అయిన ఖమాన్‌ను అమెరికా అధ్యక్షుడి కోసం వడ్డించనున్నారు. ట్రంప్ సబర్మతీ ఆశ్రమంకు వచ్చిన సమయంలో ఈ వంటకాన్ని సర్వ్ చేయనున్నారు. ఇక మెనూలో ఖమాన్ ధోక్లా, స్పెషల్ గుజరాతీ అల్లం టీ, బ్రొకోలీ మరియు కార్న్ సమోసా, ఐస్ టీ, గ్రీన్ టీ, మల్టీ గ్రెయిన్ కుక్కీస్ ఉండనున్నాయి. ఈ ఆహారంను ముందుగా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు టెస్ట్ చేస్తారు.

Recommended Video

Namaste Trump : Trump India Visit Just 36 Hours, Here Is The Schedule | Oneindia Telugu
వీఐపీలకు ఇతర సెలబ్రిటీలకు సర్వ్ చేసిన అనుభవం

వీఐపీలకు ఇతర సెలబ్రిటీలకు సర్వ్ చేసిన అనుభవం

ఇక సెలబ్రిటీలకు, వీవీఐపీలకు వంటలు చేసి సర్వ్ చేసిన అనుభవం చెఫ్‌ ఖన్నాకు ఉంది. అంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ఖన్నా వడ్డించారు. అంతేకాదు బాలీవుడ్ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్, శిల్పా శెట్టిలకు కూడా సర్వ్ చేశారు. ఇక 1990లో నేషనల్ కలినరీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు సురేష్ ఖన్నా.

English summary
Donald Trump, known for his love for meatloaf, hamburger or a steak, will get a taste of Gujarati delicacies such as Khaman and multigrain rotis during their short stay in Ahmedabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X