వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈశాన్య రాష్ట్రాల్లో బంద్ : పౌరసత్వ బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా: 11 గంటల బంద్..!

|
Google Oneindia TeluguNews

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదంతో ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు 11 గంటల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈశాన్యా రాష్ట్రాలైన అస్సాం..మణిపూర్..త్రిపురలలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా ఇవాళ అస్సాంలో బంద్ పాటిస్తున్నారు. నార్త్ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ 11 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో గౌహ‌తిలో షాపుల‌ను మూసివేశారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియ‌న్ కూడా ఈ బంద్‌లో పాల్గొంటోంది. దిబ్రూఘ‌ర్‌లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియ‌న్ భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. టైర్ల‌కు నిప్పు అంటించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం తో ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లు కారణంగా ఎవరికీ నష్టం లేదని కేంద్రం చెబుతున్నా..విద్యార్ది సంఘాలు మాత్రం ఆందోళన కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా నార్త్ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ 11 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో గౌహ‌తిలో షాపుల‌ను మూసివేశారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియ‌న్ కూడా ఈ బంద్‌లో పాల్గొంటోంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం..మణిపూర్..త్రిపురలో నిరసనలు కొనసాగుతున్నాయి. బెంగాళీలు ఎక్కువగా నివసించే బారక్ వ్యాలీ జిల్లాలైన చచర్, కరీం గంజ్, హైలాకండీతో పాటుగా హిల్ జిల్లాలు గా చెప్పుకొనే కర్బీ, డిమా హసావో లో మాత్రం బంద్ ప్రభావం లేదని అధికారులు చెబుతున్నారు.

NorthEastern states on fire with the passage of CAB, call for 11 hours bandh

అస్సాం అరుణాచల్ ప్రదేశ్‌ మేఘాలయా, మిజోరాం మరియు త్రిపురాలలో బంద్ సందర్భంగా భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే నాగాలాండ్‌లో హార్న్ బిల్ పండుగ నేపథ్యంలో బంద్‌కు మినహాయింపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న మణిపూర్ పీపుల్ అగనెస్ట్ క్యాబ్ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. క్యాబ్ బిల్లు మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేయరాదని మణిపూర్ పీపుల్ అగనెస్ట్ క్యాబ్ కన్వీనర్ యుమనంచా దిలీప్ కుమార్ చెప్పారు. డిసెంబర్ 11 ఉదయం 3 గంటల వరకు బంద్ కొనసాగనుంది.

ఇలా మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల్లో పలు సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్, టీఎంసీతో పాటు పలు పార్టీలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ లోక్‌సభలో అర్థరాత్రి బిల్లు పాస్ అయ్యింది. దీంతో ఈశాన్యరాష్ట్రాలతో పాటు బెంగాల్ రాష్ట్రం కూడా భగ్గుమంది. ముస్లింయేతర ప్రజలకు భారత పౌరసత్వం ఇచ్చి ఇతర మైనార్టీలను విస్మరిస్తే దేశంలో మతకల్లోలాలు మొదలవుతాయని విపక్షాలు మండిపడ్డాయి.

English summary
The passage of the Citizenship Amendment Bill (CAB), 2019, in the Lok Sabha led to a fresh round of protests against the controversial legislation in three northeastern states Assam, Manipur and Tripura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X