అబ్బే.. కుమారుడికి కారు కోనివ్వలేదు.. అంతా తూచ్, సోనూ సూద్ క్లారిటీ
సోనూ సూద్.. నటుడి కన్నా.. సాయం చేస్తారని అందరికీ తెలుసు. లాక్ డౌన్ సమయంలో అందరికీ అలా హెల్ప్ చేశారు. తర్వాతి ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సారి ఫాదర్స్ డే సందర్భంగా గిప్టుల విషయమై మరోసారి చర్చకు వచ్చింది. కుమారుడికి కారు కొనిచ్చారనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై సోనూ సూద్ స్పందించారు. అబ్బే అదేం లేదు అని క్లారిటీ ఇచ్చారు. పైగా ఫాదర్స్ డే సందర్భంగా తండ్రే గిప్గు ఇస్తారా అని ఎదురు ప్రశ్నించారు.

సాయం చేసి..
కరోనా సమయంలో ప్రతీ ఒక్కరికీ సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు సోనూసూద్. కుమారుడికి 3 కోట్ల రూపాయల విలువగల లగ్జరీ కారు కొనిచ్చారని వార్త వైరల్ అయ్యింది. ఇషాన్‌కు ఫాదర్స్ డే రోజు డ్రెయినింగ్ మరియు ఎల్జీజూరిస్ లగ్జరీ కారును కొనిచ్చారని వైరల్ అయ్యింది. కారు విలువ రూ. 3 కోట్లు ఉంటుందని రిపోర్ట్ చేశాయి. ఆ వార్తలపై సోను సూద్ క్లారిటీ ఇచ్చారు.

లగ్జరీ కారు లేదు..
కుమారుడికి లగ్జరీ కారు కొనిచ్చాననే వార్తల్లో నిజం లేదని సోనూ సూద్ స్పష్టంచేశారు. కొడుకు కోసం కారు కొనలేదని.. ఆ కారు ట్రయల్ కోసం మాత్రమే ఇంటికి తీసుకుని వచ్చారని.. దానిని టెస్ట్ రన్ చేశామని స్పష్టంచేశారు. కారు కొనలేదు అని క్లారిటీ ఇచ్చారు. 'ఫాదర్స్ డే సందర్భంగా కొడుకుకు కారు ఎందుకు బహుమతిగా ఇస్తాను? అతను నాకు ఏదైనా బహుమతి ఇవ్వాలి కదా? అని సోనూ సూద్ ప్రశ్నించారు. ఇద్దరు కొడుకులతో రోజంతా గడిపినప్పుడే తనకు బెస్ట్ ఫాదర్స్ డే గిఫ్ట్ అని. వారికి సమయం ఇవ్వలేకపోతున్న అని చెప్పారు. వారు పెద్దవాళ్లు అయిపోతున్నారని.. వారికంటూ సొంత జీవితం కూడా ఉంటుంది కదా అని సోనూ సూద్ అన్నారు.

హ్యాపీ..
ఊహాగానాలు నిజమేనని నమ్మినప్పటికీ, కొందరు మాత్రం తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సంతోషం కలిగించిందని సోనూసూద్ అన్నారు. తనకు అదీ చాలు అని స్పష్టంచేశారు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. నటుడిగా కన్నా.. కరోనా సమయంలో సాయం చేసి మంచి పేరు గడించారు. రియల్ లైఫ్ హీరోగా నిలిచారు.












Click it and Unblock the Notifications