సాధారణమేమీ కాదు: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌పై అమిత్ షా సంచలనం

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌కు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఓ జాతీయ పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జూ 1 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అత్యున్నత న్యాస్థానం ఇచ్చిన ఈ తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు.

Not a routine judgment Amit Shah On Arvind Kejriwal s Bail In Delhi Liquor Policy Case

కేజ్రీవాల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందన్నారు అమిత్ షా. ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. దోషులుగా తేలినవారిని కోర్టు జైలుకు పంపదని చెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బెయిల్‌ను నిబంధనల ప్రకారమే ఉపయోగించుకుంటున్నారా? లేదా దుర్వినియోగం చేస్తున్నారో మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని అమిత్ షా సూచించారు.

తీహార్ జైల్లో కెమెరాల ద్వారా తన కదలికలు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుతున్నాయని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఆ జైలు పాలన అధికారం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉందని గుర్తు చేశారు. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తామని దేశమంతటికీ హామీ ఇస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు.

కేజ్రీవాల్ పార్టీ కేంద్రంలో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్ తన అరెస్టు అక్రమమని అంటున్నారని.. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిందని.. గడువు ముగిసిన తర్వాత మళ్లీ జైలుకే వెళ్లాల్సిందేనని అమిత్ షా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+