రాజకీయాల్లోకి ప్రణబ్ కూతురు, బరిలోకి దిగే ఛాన్స్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను బట్టి 2014 సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఆమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది చర్చకు దారి తీసింది.
తమది రాజకీయ కుటుంబమని, రాజకీయాలపై తనకెందుకు ఏవగింపు ఉంటుందని శర్మిష్ఠ ముఖర్జీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ప్రచారంలో ఉండటం, రాజకీయాలు అంటే ఏవగింపు లేవని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి.

తమది కాంగ్రెస్ కుటుంబమైనందున ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడం తన కర్తవ్యంగా భావించానని శర్మిష్ఠ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నిస్తే.. పోటీ కంటే రాజకీయాలు ఎక్కువని వ్యాఖ్యానించారు. అయితే తన రాజకీయ రంగ ప్రవేశానికి గల అవకాశాలను ఆమె కొట్టిపారేయలేదు.
రాష్ట్రపతి పేరుతో ట్విట్టర్‌లో నకిలీ ఖాతా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరుతో గుర్తు తెలియని ట్విట్టర్‌లో తెరిచిన ఖాతాను అధికారులు గుర్తించారు. వెంటనే దానిని తొలగించి చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై దర్యాఫ్తు చేయాలని పోలీసులను కోరారు. రాష్ట్రపతి పేరుతో నకిలీ ఖాతా గురించి ప్రజల్ని అప్రమత్తత చేస్తూ ప్రధాని మీడియా సలహాదారు పంకజ్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications