హర్యానాలో జునైద్ హత్య: స్పందించిన సబా దివాన్, హోరెత్తిన నిరసన
జునైద్‌ను బీఫ్ తీసుకెళుతున్నాడని ఆరోపిస్తూ అల్లరిమూక దాడి చేసి కత్తిపోట్లకు పాల్పడటంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: ఒక భావనగా మొదలై.. క్రమంగా ఎదుగుతుందని ఆశ.. ఆ పై నిశ్శబ్ధ ఆలోచనగా మారుతుంది.. తదుపరి నిశ్శబ్ధ పదంగా.. ఆ పిదప పెద్ద గొంతుకగా పెగిలి రణన్నినాదమవుతుంది' అని ప్రముఖ సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇది గతవారం ఢిల్లీ నుంచి హర్యానా వెళుతున్న ముస్లిం యువకుడిపై దాడి, హత్య చేయడం ఆమెను కదిలించింది.. అటు పిమ్మట దేశం నలుమూలల నగరాలు, పట్టణాలు.. విదేశాల్లోని ప్రజలనూ కదిలించింది. ఘటన జరిగిన తర్వాత ఆరు రోజులకు బుధవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దారితీసింది.
రంజాన్ పండుగకు ముందుకు ఈ నెల 22న అవసరమైన షాపింగ్ చేసుకుని రైలులో హర్యానా రాష్ట్రం బల్లాభ్ గఢ్ జిల్లా పరిధిలోని సొంత ఊరికి వెళుతున్న జునైద్‌ను బీఫ్ తీసుకెళుతున్నాడని ఆరోపిస్తూ అల్లరిమూక దాడి చేసి కత్తిపోట్లకు పాల్పడటంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ హత్య జరిగిన మరుసటి రోజే ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పిలుపునిచ్చారు.

11 నగరాల్లో నిరసన వెల్లువ
‘నాట్ ఇన్ మై నేమ్' అనే పేరుతో ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది. ‘జునైద్ హత్యకు నిరసనగా ఎందుకు ప్రదర్శనలు జరుగడం లేదు. రాజకీయ సంస్థలు, పార్టీలు పూనుకునే వరకు ఎందుకు వేచి ఉండాలి. నాట్ ఇన్ మై నేమ్' అనే బ్యానర్ కింద ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశ పౌరులుగా మనమంతా ఈ దాడులను ఎందుకు తిప్పికొట్టగూడదు? ' అని ప్రశ్నిస్తూ ఆమె పోస్టు చేశారు. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ప్రదర్శన వివరాలను వెల్లడించారు. ఆ పోస్ట్ స్ఫూర్తిగా బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తోపాటు దేశంలోని 11 నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్, టొరంటో, బోస్టన్, కరాచీ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయని దివాన్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. తన పిలుపునకు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని తానూ ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.

జంతర్ మంతర్ వద్ద ఇలా నిరసన
జునైద్‌పై దాడిని నిరసిస్తూ ఢిల్లీ వాసులు ప్రదర్శన నిర్వహించారు. నాట్ ఇన్ మై నేమ్, నాట్ ఇన్ ఎనీవన్ నేమ్, ముస్లింల జీవన సమస్య.. అందరి జీవన సమస్య అనే శీర్షికలతో కూడిన పోస్టర్లు, ప్లకార్డులు జంతర్‌మంతర్ వద్ద జరిగిన ప్రదర్శనలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పాల్గొన్నారు. భారతదేశంలో ‘భయకంపిత వాతావరణం' నెలకొన్నదని పేర్కొంటూ ఆందోళనకారులు కవితలు చదువుతూ, పాటు పాడుతూ, పోస్టర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు.

సర్కార్ మౌన ముద్ర వహిస్తుందని విమర్శలు
‘నాట్ ఇన్ మై నేమ్, నాట్ ఇన్ ఎనీవన్స్ టైమ్', ‘ముస్లింల జీవన సమస్య, అందరి జీవన సమస్య' అని నినదించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా, జేడీయూ నేత కేసీ త్యాగి, సీపీఐ కార్యదర్శి డీ రాజా, ప్రముఖ నేపథ్య గాయని రబ్బి షెర్గిల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ‘వ్యవస్థీక్రుత హింసకు వ్యతిరేకంగా మేం నిరసన జరిపాం. ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వం మౌనముద్ర వహించడం తప్పా ఏమీ చేయలేదు‘ అని సబా దివాన్ పేర్కొన్నారు.

రామచంద్ర గూహ ఆధ్వర్యంలో నిరసన
ముంబైలో షబానా అజ్మీ, బెంగళూరులో చరిత్ర పరిశోధకుడు రామచంద్ర గుహా, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ తదితరులు, కోల్ కతాలో ప్రముఖ సినీ నిర్మాత అపర్ణా సేన్ నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. జునైద్‌పై దాడి ఘటనలో ఢిల్లీకి చెందిన ప్రభుత్వోద్యోగి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఫరీదాబాద్ ఎస్పీ కమల్‌దీప్ గోయల్ తెలిపారు. కాగా, ఈ ఘటనను హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్రంగా ఖండించారు.

కవితలు, గేయాలతో నిరసనలు
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూకుమ్మడి దాడులు పదేపదే పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన నిలబడితే వారిని రక్షించడం కోసం మౌనముద్ర వహించడానికి బదులు కుట్రదారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే తరహా నిరసన ప్రదర్శనలు ముంబై, హైదరాబాద్, తిరువనంతపురం, భోపాల్ తదితర ప్రాంతాల్లో జరిగాయి. ప్రముఖ సినీ నటులు కల్కి కౌచిలిన్, కొంకణ్ సేన్ శర్మ తదితరులు ముంబై ప్రదర్శనలో పాల్గొన్నారు.

జాతిపిత పేరిట ఇలా నిరసనలు
ఒకవైపు ముంబై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నా నిరసన కారులు ప్రదర్శనలో పాల్గొనడం గమనార్హం. ఢిల్లీ జంతర్ మంతర్ ప్రదర్శనలో పాల్గొన్న విష్ణు అనే విద్యార్థి మాట్లాడుతూ మూకుమ్మడి దాడులు ఎక్కడ జరిగినా తాను వ్యతిరేకినని, ఇటువంటి ఘటనలు భారతదేశ లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు బూటకపు జాతీయవాదంతో మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీ రాసిన కవితలను రాసి నిరసన తెలిపారు. సామాన్యుల్లో ఒకరి పట్ల మరొకరికి వ్యతిరేకత లేదని, కొందరు వ్యక్తులు లేని ఉద్రిక్తతలు కల్పిస్తున్నారని ఆరోపించారు.
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications