Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు: ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆందోళన

RSS Chief Mohan Bhargwat: నేడు విజయదశమి. దేశవ్యాప్తంగా ఈ పండగ కోలాహలంగా సాగుతోంది. ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల అమ్మవారి ఆలయాల్లో సందడి నెలకొంది. వరంగల్ భద్రకాళి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో విజయదశమిని వేడుకలు ఘనం సాగాయి. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఈ తెల్లవారు జామున శస్త్ర పూజ నిర్వహించారు. అనంతరం ఘోష్ పాఠక్‌లో పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు.

Not only Hindus Mohan Bhagwat condemns atrocities in Bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీన సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన తరువాత అక్కడ నెలకొన్న పరిణామాల పట్ల ప్రతి ఒక్క హిందువులనూ ఆందోళనకు గురి చేస్తోన్నాయని పేర్కొన్నారు. ఒక్క హిందువులు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్‌లో నివసిస్తోన్న ప్రతి మైనారిటీ కూడా దాడుల బారిన పడుతున్నారని అన్నారు.

అక్కడ నెలకొన్న రాజకీయ పరిణామాలను హిందువులపై దాడులకు ఉపయోగించుకుంటోన్నారంటూ మోహన్ భగవత్ మండిపడ్డారు. అక్కడ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడే సంప్రదాయం పునరావృతమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో హిందువులు ఏకతాటిపైకి రావడం, సమైక్యంగా రోడ్ల మీదికి వచ్చి ఉద్యమించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ర్యాడికల్ భావజాలంతో హిందువులందరూ సంఘటితం అయ్యారని, తమ రక్షణ కోసం రోడ్లపైకి వచ్చారని చెప్పారు. హిందువులకే కాదు, మైనారిటీలందరికీ భారత్ సహాయం చేయాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ అన్నారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా హిందువులు ఐక్యంగా శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందని, బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటోన్న అఘాయిత్యాలు, దురాగతాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని కోరారు.

Not only Hindus Mohan Bhagwat condemns atrocities in Bangladesh

భారత్ నుంచి ముప్పు ఉందని బంగ్లాదేశ్ భావిస్తోందని, అందుకే పాకిస్తాన్ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కొత్తగా చర్చలు మొదలయ్యాయని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్‌ దూకుడును అడ్డుకోవచ్చంటూ కొందరు ప్రకటనలు చేస్తోన్నారని ఆరోపించారు.

నిజానికి బంగ్లాదేశ్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, ఇప్పటివరకు కూడా ఎలాంటి శతృవైఖరినీ ప్రదర్శించలేదని, ఇక ముందు కూడా ఉండబోదనీ మోహన్ భగవత్ అన్నారు. భారత్‌లో కూడా బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు రావాలని చాలామంది కోరుకుంటున్నారని ఆయన తేల్చి చెప్పారు.

ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అవతరిస్తోన్న భారత్ దూకుడును నిలువరించాలనే ఉద్దేశంలో కొందరు ఉన్నారని, వారి ప్రయత్నాలు ఫలించకూడదంటే హిందువులు సంఘటితం కావాలని అన్నారు. డీప్ స్టేట్, వోకిజం, కల్చరల్ మార్క్సిజం.. వంటి పదాలు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోన్నాయని గుర్తు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+