పర్యాటకుల జీపు ముందు పులి: ఏం చేశారు(వీడియో)
నాగ్‌పూర్: రెండ్రోజుల క్రితం గుజరాత్ తీరంలో ఓ సింహం భయాందోళనలకు గురిచేయగా.. తాజాగా ఓ పులి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌లోని ఉమ్రెడ్ కర్హాండ్ల అటవీ జంతువుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు ఓపెన్ టాప్ జీపులో బయల్దేరారు పర్యాటకులు.
వారు అటవీ అందాలు వీక్షిస్తుండగా ఒక్కసారిగా ఓ పెద్దపులి వారి జీపు వద్దకు వచ్చింది. దాన్ని చూసిన ఆ పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్పుడు ఆ జీపులో ఇద్దరు పర్యాటకులతోపాటు ఓ పిల్లాడు కూడా ఉన్నారు.
WATCH: Tourist captures video as Tiger comes close to car in Umred Karhandla Wildlife Sanctuary near Nagpur (Jan 1)
https://t.co/LxilBJdqkQ
— ANI (@ANI_news) January 3, 2016 అయితే, జీపులో ఉన్న ముగ్గురిని పెద్దగా పట్టించుకోకుండా పులి మాత్రం వాహనం ముందు అద్దంతో కాసేపు ఆడుకుంది. ఈ కాసేపు ఆ ముగ్గురు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉలుకు-పలుకు లేకుండా అలికిడి చేయకుండా బొమ్మల్లా ఉండిపోయారు.
కాగా, వారికి ఎలాంటి హాని చేయకుండానే పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.
WATCH: Lion swims off Jafrabad coast in Gujarat's Amreli, spotted by fishermen, later captured by forest officials
https://t.co/UlGBJCM9KS
— ANI (@ANI_news) January 3, 2016 ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం గుజరాత్ అమ్రెల్లి జిల్లాలోని జఫ్రాబాద్ వద్ద ఓ సింహం సముద్రంలోకి దూకి ఈతకొడుతుండగా.. అటవీ అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు.












Click it and Unblock the Notifications