బీహార్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు: ఈసీ వివణ -తేజస్వీ ఆరోపణలపై ఖండన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి 150కిపైగా స్థానాల్లో ఓట్ల తేడా 200 నుంచి 1000లోపు కొనసాగుతూ ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార కూటమి నేతలు తమకున్న పవర్ ను ఉపయోగించి.. స్వల్ప మార్జిన్ ఉన్న చోట్ల ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు సంచలన ఆరోపణలు చేశాయి. దీనిపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది.
సీఎం బంగళా నుంచి నితీశ్ కుమార్, ఆయన డిప్యూటీ సుశీల్ మోదీలు ఆయా రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ కేంద్రాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, తక్కువ మార్జిన్ ఉన్న చోట్ల ఫలితాలను తారు మారు చేస్తున్నారని, ఇప్పటికే మహాకూటమి 119 సీట్లు గెలవగా, 10 చోట్ల అభ్యర్థులకు గెలుపు పత్రాలను అధికారులు ఇవ్వలేదని ఆర్జేడీ నేత తేజస్వీ ఆరోపించారు. దీనిపై..

తేజస్వీ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుంది. సీఎం నితీశ్ లేదా మరొకరి డైరెక్షన్ లో ఎన్నికల సంఘం పనిచేయబోదని, తాము ఎటువంటి ఒత్తిడికి లోనుకాలేదని బీహార్ ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. గెలిచిన 10 మందికి సర్టిఫికేట్లు ఇవ్వలేదనడం భావ్యం కాదని, ఎక్కడికక్కడ నిబంధనల ప్రకారం ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. అయినా..
243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో రాత్రి 12 గంటల వరకు 146 సీట్లలో మాత్రమే ఫలితాలు వచ్చాయని ఈసీ తెలిపింది. తద్వారా తుది ఫలితాల తర్వాతే మాట్లాడటం మంచిదని పార్టీలకు హితవు పలికింది. కరోనావైరస్ సంబంధిత పరిమితుల వల్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతున్నదని ఈసీ పేర్కొంది.












Click it and Unblock the Notifications