బెంగాల్ లో 32 లక్షల ఓట్లతో ఫలితాలు తారుమారు
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చారిత్రక విజయాన్ని అందుకుంది. 206 సీట్లను గెలుచుకుని బెంగాలీ గడ్డపై అడుగు మోపింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అంతం చేసింది. టీఎంసీ 81 సీట్లకే పరిమితమైంది. మూడు దఫాలుగా గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సొచ్చింది. బీజేపీ సాధించిన ఈ విజయంతో.. ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆరంభమైంది.
బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారకుడు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి. 2021 నాటి ఎన్నికల ముందు వరకూ మమత బెనర్జీకి రైట్ హ్యాండ్ గా ఉంటూ వచ్చాడు సువేందు. ఆమె కేబినెట్ లోనూ పని చేశాడు. ఆ తర్వాత బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి పదవిని ఇస్తామనే బీజేపీ హామీ ఇవ్వడంతో పార్టీ ఫిరాయించాడు. దీంతో.. బెంగాల్ సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ గా నిలిచాడు సువేందు అధికారి.

ఈ ఎన్నికల్లో బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్ మధ్య దాదాపు 32 లక్షల వరకు ఓట్ల తేడా కనిపించింది. ఈ 32 లక్షల ఓట్ల తేడాను ఇతరులు, నోటా పంచుకున్నాయంటే నమ్మగలరా. పశ్చిమ బెంగాల్ లో అదే జరిగింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్రులకు 32 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 27,17,878 ఓట్లు ఇతరులకు పోల్ కాగా.. మిగిలిన 4,94, 932 ఓట్లు నోటాకు పడ్డాయి.
ఈ రెండూ కలిపితే వచ్చే సంఖ్య దాదాపు 32 లక్షలు. ఇదే తేడా బీజేపీ- తృణమూల్ మధ్య కనిపించింది. ఈ 32 లక్షల ఓట్ల ఆధిక్యతతో బీజేపీ గెలిచింది. అవే ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ ను దెబ్బకొట్టాయి. ఆయా పార్టీల మధ్య పోల్ అయిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే..
బీజేపీ- 2,92,24,167 (45.84 శాతం)
తృణమూల్ కాంగ్రెస్- 2,60,13,379 (40.80 శాతం)
సీపీఎం- 28,39,066 (4.45 శాతం)
కాంగ్రెస్- 18,90,851 (2.97 శాతం)
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్- 1,76,980 (0.28 శాతం)
ఎంఐఎం- 57,253 (0.09 శాతం)
బీఎస్పీ- 1,17,166 (0.18 శాతం)
సీపీఐ- 99, 223 (0.16 శాతం)
సీపీఐ (ఎంఎల్) (ఎల్)- 46,399 (0.07 శాతం)












Click it and Unblock the Notifications