కేజ్రీవాల్ ఎఫెక్ట్: ఢిల్లీలో నోటాకు నో, ప్రముఖుల స్థానాల్లో..

NOTA fails in New Delhi
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కొత్తగా తీసుకు వచ్చిన నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్, తిరస్కరణ ఓటు) ప్రభావం ఢిల్లీలో అంతగా కనిపించనప్పటికీ మిగిలిన మూడు రాష్ట్రాల్లో మాత్రం కనిపించింది. ఢిల్లీలో యువత యావత్తు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారు! దీంతో ఎక్కువ మంది ఎఎపి వైపు మొగ్గు చూపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రం నోటా ప్రభావం కనిపించింది. ఢిల్లీలో ఒక్క శాతం కంటే తక్కువ మంది నోటా వైపు మొగ్గగా, మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.

ప్రముఖుల విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిష, బుధ్‌నీ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. విదిషలో 1,368 ఓట్లతో నోటా మూడో స్థానంలో, బుధ్‌నీలో 2,247 ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది.

దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్ధన్ సింగ్ రాఘోగఢ్ నుండి బరిలో దిగారు. ఇక్కడ నోటాకు 2,587 మంది ఓటేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రాతినిథ్యం వహించిన రాజ్‌నాథ్ గాంవ్‌లో నోటాకు 2,042, మహేంద్ర కర్మ భార్య దేవతి కర్మ పోటీ చేసిన దంతేవాడలో 9,677లో నోటాకు వచ్చాయి.

రాజస్థాన్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి వసుందరా రాజే నియోజకవర్గంలో నోటా 3,729 ఓట్లతో మూడో స్థానంలో, కాంగ్రెసు నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నియోజకవర్గం సర్దార్‌పురాలో 1,779 ఓట్లు నోటాకు పోలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+