వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా జడ్జిపై అత్యాచారం, ఆపై హత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

 Now, a woman judge raped in UP!
లక్నో: మహిళపై అత్యాచారాల విషయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి చెప్పడానికి వీలు కాకుండా ఉంది. కీచకులు మహిళా న్యాయమూర్తిని కూడా పదిలిపెట్టలేదు. అలిగడ్‌లో మంగళవారంనాడు ఓ మహిళా జడ్జిపై అత్యాచారం చేసి, ఆమెను చంపడానికి ప్రయత్నించారు. పోలీసులు మంగళవారంనాడు ఈ విషయం చెప్పారు.

ఆమె స్పృహ తప్పి తన అధికారిక నివాసంలో పడి ఉన్నారు. ఆమెకు విపరీతంగా డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేసినట్లు సమాచారం. ఆమె శరీరంపై ఎక్కడపడితే అక్కడ గాయాలున్నాయి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ చెప్పారు.

బాధితురాలు ఇంకా స్పృహలోకి రాలేదని, దాంతో వైద్య పరీక్షలు ఏమీ చేయలేదని, ఆమెకు స్పృహ వచ్చి విచారించే స్థితికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేయిస్తామని ఆయన చెప్పారు. సగం ఖాళీ అయిన పురుగుల మందు సీసా కూడా సంఘటనా స్థలంలో ఉంది.

భయంతో దుండగులు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించి ఉంటారని అనుమానిస్తున్నారు. దాడి చేసినవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాదౌన్ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసి, వారిని చంపిన సంఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసిన నేపథ్యంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం కలవరానికి గురి చేస్తోంది.

English summary

 Even a woman judge has not been spared in Uttar Pradesh. The judge was raped and an attempt was made to kill her in Aligarh, police said Tuesday. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X