గీతాంజలి జెమ్స్, మరో 23 సంస్థలకు ఎన్ఎస్ఈ జరిమానా
ముంబై: వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించనందుకు గీతాంజలి జెమ్స్ సహా మరో 23 సంస్థలకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ జరిమానా విధించింది.
ఇప్పటికీ నిబంధనల ప్రకారం ఆర్థిక ఫలితాలను ప్రకటించకుంటే సస్పెన్షన్ విధించే అవకాశముంది. సెంట్రల్ డిపాజటరీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ఈ నిర్ణయానికి సంబంధించిన లేఖలను వాటాదారులకు పంపనుంది.

షేర్ హోల్డింగ్ ప్యాట్రన్, ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించని సంస్థల వాటాదారులకు లేఖలు పంపించే విధానాన్ని ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రతినిధి తెలిపారు. మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీ డిసెంబర్ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించలేదని వాటాదారులకు లేఖలు రాయనుంది.












Click it and Unblock the Notifications