Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NEET 2024: నీట్ దరఖాస్తులు ప్రారంభం, యాక్టివైన లింక్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి అంటే ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఇంగ్లీష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/ క్లిక్ చేయండి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1600.

NTA NEET UG registration begins at neet.ntaonline.in; form link active now.

ఎస్సీ,ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంట మధ్య జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+