తమిళనాడులో గెలిచేది ఆ పార్టీనే: జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!!

తమిళనాడులోని ఓటర్లు చరిత్ర సృష్టించారు. 1947 స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తమిళనాడులో ఓటింగ్ 85 శాతం దాటింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమిళనాడులో అత్యధికంగా కరూర్ నియోజకవర్గంలో 92.48 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో సాలెం 90.42 శాతం, ధర్మపురి 90.02 శాతం, ఈరోడ్ 89. 97 శాతం ఓటింగ్ నమోదైంది.

అలాగే నమ్మక్కల్ లో 89.63 శాతం ఓటింగ్ పోలైంది. 2011 ఎన్నికల్లో ఓవరాల్ గా 78.29 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే 2021 లో 76.6 శాతం పోలింగ్ నమోదైంది. ఇక భారీగా ఓటింగ్ పెరగడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓటర్లను ప్రశంసించారు. ఓటర్ల బలమైన భాగస్వామ్యానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు.

అయితే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తమిళనాడులో ఫలానా పార్టీ గెలుస్తుందని అంచనా వేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తమిళ ప్రముఖ నటుడు సముద్రఖని తెలిపాడు. అయితే ఎన్టీఆర్ చెప్పిన జోస్యం ఈ ఎన్నికల్లో కాదు.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అయితే ప్రస్తుతం తమిళనాట ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, సముద్రఖని మధ్య జరిగిన సంభాషణలో ఎలక్షన్స్ టాపిక్ వచ్చిందట.

NTR and Samuthirakani Discuss Tamil Nadu Polls Viral Video Sparks Massive Debate on Social Media

అదే సమయంలో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. అయితే తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఆ పార్టీ అధ్యక్షులు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని తారక్ తనతో చెప్పినట్లు.. ఈ విషయాన్ని స్వయంగా సముద్రఖని వెల్లడించాడు. ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సముద్రఖని పేర్కొన్నాడు. అంతేకాక తమిళ ప్రజల నాడిని ఎన్టీఆర్ ముందే పసిగట్టారని ఆయన తెలిపాడు. ఆ తర్వాత రిజల్ట్స్ సేమ్ ఎన్టీఆర్ చెప్పినట్లే రావడంతో షాక్ అయినట్లు చెప్పుకొచ్చాడు సముద్ర ఖని. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఎన్టీఆర్ చెబితే బాగుంటుందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+