Nurse: బంపర్ ఆఫర్, గోకాడు, గుడారం మార్చేశాడు, సీఎం టౌన్ లో చీటింగ్ కేసు, ఆన్ లైన్ దెబ్బ !
బెంగళూరు/చెన్నై: సైలెంట్ గా నర్సు ఉద్యోగం చేస్తున్న యువతి జీవితంలో బహుమతి (గిఫ్ట్) పేరుతో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. మీకు లక్షల రూపాయల లాటరీ తగిలిందని, మీ మొబైల్ నెంబర్ కు మాత్రమే ఆ చాన్స్ చిక్కిందని మాయమాటలు చెప్పాడు. గిఫ్ట్ పేరుతో నర్సును గోకిన కేటుగాళ్లు ఆమె నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకుని గుడారం మార్చేయడంతో పాపం ఆ నర్సు లబోదిబో అంటూ పోలీసుల చుట్టూ తిరుగుతోంది. సీఎం హోమ్ టౌన్ లో ఇలాంటి చీటింగ్ కేసు ఆలస్యంగా వెలుగు చూసింది.

నర్సు ఉద్యోగం... మంచి జీతం
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా అయిన శివమొగ్గలో వనిత (29) అనే యువతి నివాసం ఉంటున్నది. శివమొగ్గలోని ప్రముఖ ఆసుపత్రిలో వనిత నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. నర్సుగా ఉద్యోగం చేస్తున్న వనిత మంచి జీతం సంపాధిస్తూ ఇంతకాలం సంతోషంగా జీవించింది.

హలో మేడమ్.... మీ మొబైల్ నెంబర్ కు !
నర్సుగా ఉద్యోగం చేస్తున్న వనిత వచ్చే జీతం చాలా పొదుపుగా దాచిపెట్టుకుంటూ వచ్చింది. ఒక రోజు ఓ వ్యక్తి వనితకు ఫోన్ చేశాడు. మేము ఢిల్లీలోని నాపటల్ (Naaptol) ఆన్ లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని ఆమెతో పరిచయం చేసుకున్నారు. మీకు ఆన్ లైన్ షాపింగ్ లో రూ. 12.50 లక్షల బహుమానం వచ్చిందని ఆ వ్యక్తి వనితకు మాయమాటలు చెప్పాడు.

లాటరీ డబ్బులు ఎవ్వరికీ ఊరికేరావు
మీకు వచ్చిన లాటరీ డబ్బులు మీరు తీసుకోవాలని, ఆలస్యం అయితే అది ల్యాప్స్ అయ్యే అవకాశం ఉందని కేటుగాడు వనితకు మాయమాటలు చెప్పాడు. ఒక్కసారిగా తనకు రూ. 12.50 లక్షలు వస్తాయని, ఆ డబ్బుతో సంతోషంగా గడపడానికి అవకాశం ఉందని వనిత ఎగిరిగంతేసింది. అయితే మీకు వచ్చిన డబ్బులు ఊరికే రావని, షరతులు వర్థిస్తాయని కేటుగాడు కొన్ని షరతులు పెట్టాడు.

గోకి మూడు లక్షలు నాకేశాడు
మీకు వచ్చిన లాటరీ డబ్బులు తీసుకోవాలంటే ముందుగా మీరు కొంచెం నగదు కంపెనీలో డిపాజిట్ చెయ్యాలని కేటుగాడు వనితకు చెప్పాడు. ఇలాంటి షరతులు పెట్టిన కేటుగాడు చెప్పినట్లు వనిత మూడు విడతల్లో మూడు లక్షల రూపాయల డబ్బులు అతని బ్యాంకు అకౌంట్ లకు బదిలి చేసింది.

గుడారం ఎత్తేశాడని కేసు
మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న తరువాత కేటుగాడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఎంతకాలానికి అతని ఫోన్ ఆన్ చెయ్యకపోవడం, లాటరీ డబ్బులు రాకపోవడంతో వనితకు అనుమానం పెరిగింది. రూ. 12 లక్షల కథ దేవుడు ఎరుగు, ముందు నేను ఇచ్చిన నా మూడు లక్ష్లలు ఇప్పంచండి సార్ అంటూ వనిత శివమొగ్గలోని సీఇఎన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

సీఎం టౌన్ లో చీటింగ్ కేసు
రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోవడం, ఉద్దరగా డబ్బు వస్తుందని ఇలా మోసపోతున్న వాళ్ల సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లాలో ఇలాంటి చీటింగ్ కేసు వెలుగు చూడటంతో పోలీసులు సైతం ఆ సైబర్ నేరగాళ్ల ఆచూకి కోసం వేట మొదలుపెట్టారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications