Nurse: ఉద్యోగానికి వెళ్లిన నర్సు, ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో ?, ఏమైయ్యింది, ఏం జరిగింది !
చెన్నై/తిరుచ్చి: నర్సింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసిన యువతి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటోంది. ఆసుపత్రికి వెళ్లిన నర్సు మాయం అయ్యింది. కూతురి కోసం ఆమె తల్లిదండ్రులు ప్రతిచోట గాలించినా ఫలితం లేదు. మా కుమార్తె కనపడటం లేదని పోలీసులను ఆశ్రయించారు. నర్సు ఆసుపత్రిలోకి వెళ్లి ఉద్యోగం ముగించుకుని మళ్లీ బయటకు వస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఆమె ఎక్కడికి వెళ్లింది ? ఎవరితో వెళ్లింది ?, ఏం జరిగింది ? ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అనే విషయం అంతుచిక్కడం లేదని పోలీసులు అంటున్నారు.

గారాబంగా పెచ్చుకున్న తల్లిదండ్రులు
తమిళనాడులోని తిరుచ్చిలోని దిగువ బస్టాండ్ సమీపంలోని చింతామణి గోరిమెడు ప్రాంతంలో సుందరవడివేలు, శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. సుందరవడివేలు, శాంతి దంపతులకు దుర్గాదేవి (18) అనే కుమార్తె ఉంది. దుర్గాదేవిని గారాబంగా పెంచి పేషించిన కుటుంబ సభ్యులు ఆమెను నర్సింగ్ చదివించారు.

నర్సుగా ఉద్యోగం
నర్సింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసిన దుర్గాదేవి తిరుచ్చిలోని ఊరియూరు ప్రాంతంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. దుర్గాదేవి ప్రతిరోజు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటోంది. ఉద్యోగానికి వెళ్లిన దుర్గాదేవి ఒక్కసారిగా కనపడకుండాపోయింది.

సీసీటీవీ కెమెరాల్లో ?
కూతురు దుర్గాదేవి కోసం ఆమె తల్లిదండ్రులు సుందరవడివేలు, శాంతి దంపతులు బంధువుల ఇళ్లల్లో, స్నేహితుల ఇళ్లల్లోతో పాటు అనేక ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేదు. నాలుగు రోజులు అయినా మా కుమార్తె దుర్గాదేవి ఇంటికి రాలేదని, ఆమె కనపడటం లేదని సుందరవడివేలు పోలీసులను ఆశ్రయించారు.

నర్సు మొబైల్ ఫోన్ ?
నర్సు దుర్గాదేవి ఆసుపత్రిలోకి వెళ్లి ఉద్యోగం ముగించుకుని మళ్లీ బయటకు వస్తున్న దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనపడుతున్నాయి. కేసు నమోదు చేసిన తిరుచ్చి పోలీసులు నర్సు దుర్గాదేవి కోసం గాలిస్తున్నారు. దుర్గాదేవి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

నర్సును ఎవరైనా ?
ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన దుర్గాదేవి ఎక్కడు వెళ్లింది ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. దుర్గాదేవి ఎక్కడికి వెళ్లింది ?, ఎవరితోనైనా ఆమె వెళ్లిందా ?, ఎవరైనా కిడ్నాప్ చేశారా ? అనే విషయం అంతుచిక్కడంలేదని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. కరోనా కాలంలో క్రమం తప్పకుండా ఉద్యోగానికి వెళ్లి వస్తున్న నర్సు దుర్గాదేవి ఒక్కసారిగా కనపడకుండా పోవడంతో తిరుచ్చిలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications