విన్నపాలు వినవలె: మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధానిని కలిసిన సీఎం

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీని కలిశారు. ఫొణి తుఫాను తర్వాత పట్నాయక్ ప్రధానిని ఢిల్లీ వెళ్లి కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత తమ రాష్ట్ర సమస్యలపై మోడీతో చర్చించారు. ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారు. ఫొణి తుఫానుతో తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఫొణి తుఫానుతో రాష్ట్రానికి రూ.11,900 కోట్లు మేరా నష్టం వాటిల్లినట్లు పట్నాయక్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనను కలిసినప్పటి ఫోటోను ప్రధాని మోడీ ట్విటర్‌లో పోస్టు చేశారు. నవీన్ పట్నాయక్ రాష్ట్రపతిని ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఇదిలా ఉంటే ఫొనీ తుఫాను ఒడిషా రాష్ట్రాన్ని అతలా కుతలం చేయడంతో ఎన్నికల నిబంధన ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం అనుమతితో ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

Odisha CM meets PM Modi, Requests special status to the state

ఫొని తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడమే కాక 60 మంది ప్రాణాలను కూడా తీసింది. ఇదిలా ఉంటే ఫొణి తుఫాను వస్తుందని తెలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్టాన్ని మరింత నియంత్రించినందుకు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను మోడీ కొనియాడారు.ఆసమయంలో ఒడిషాను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ వెంటనే రూ.1000 కోట్లను విడుదల చేశారు.

2000 నుంచి ఒడిషాలో బీజేడీ ప్రభుత్వమే ఉంది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 112 స్థానాల్లో విజయం సాధించి తిరిగి నవీన్ పట్నాయక్ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ సారి బీజేపీ కూడా ఎన్నడూ లేనంతగా లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటింది. ఏకంగా 8 స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. 12 స్థానాల్లో బీజేడీ గెలువగా ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అసెంబ్లీ సీట్లు చూస్తే బీజేపీకి 23 స్థానాలు రాగా కాంగ్రెస్ 9 స్థానాల్లో నెగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+