lockdown:25 మంది జాలర్లు, సముద్రంలో 1100 కి.మీ ప్రయాణం, తీరం చేరిన వెంటనే..
లాన్‌డౌన్ సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు చెబుతోన్నా కొందరు వినిపించుకోవడం లేదు. సముద్రమార్గంలో కొందరు జాలర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తం 39 మంది జాలర్లు బోటులో సముద్రంలో ప్రయాణించారు. అయితే లాక్ డౌన్ వల్ల తీరప్రాంతాల్లో పకడ్బందీగా గస్తీ ఉంది. దీంతో తమ స్వస్థలం చేరుకునేందుకు దాదాపు 1100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 25 మంది జాలర్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది జాలర్లు కలిసి ఈ నెల 24వ తేదీన వేట కోసం సముద్రానికి వెళ్లారు. వీరంతా చెన్నై చేరుకొని.. అక్కడే బోటు అద్దెకు తీసుకొని వెళ్లారు. కానీ వేట సాధ్యం కాకపోవడంతో 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురంలో కొందరు మత్స్యకారులు దిగిపోయారు. పాటి సొనెపూర్‌లో మరికొందరు శనివారం దిగిపోయారు. మిగతావారు ఒడిశా గంజానికి సోమవారం వచ్చారు. వీరి గురించి తెలుసుకున్న అధికారులు.. వెంటనే వారి గురించి ఆరాతీశారు. వారికి ఆహారం అందజేశారు తర్వాత వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. గమ్యం చేరుకునేందుకు జార్లు ఉపయోగించిన బోటును కూడా సీజ్ చేశారు.

ఏపీకి చెందిన 14 మంది జాలర్లు డాంకూరులో దిగిపోయారని అధికారులు తెలిపారు. అయితే మొత్తం 39 మంది జాలర్లను ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్ చేసినట్టు పేర్కొన్నారు. జాలర్ల ఘటనతో ఒడిశా ప్రభుత్వం ఉలిక్కిపడింది. తీరప్రాంతాల్లో గస్తీని మరింత కఠినం చేయాలని ఆదేశించింది.
Recommended Video
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications