ఒడిషాలో వరదల బీభత్సం: 35 మంది దుర్మరణం

భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా మరిణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో నేతల పర్యటనలు కొనసాగుతున్నాయి.

ఒడిషాలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు అక్కడ వరద బీభత్సం కొనసాగుతోంది. మహానది, వైతరణితోపాటు అనేక నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వేల సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. 1.8 మిలియన్ ప్రజలు వరద తాకిడికి తీవ్రంగా ప్రభావితమయ్యారు.

Odisha Floods Kill 35, Affect 1.8 Million People

వరద తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి. మొత్తం 23 జిల్లాల్లోని 1553 గ్రామాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

క్రమంగా సాధారణ స్థితి నెలకొంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినా మహానది, దేవి, వైతరణి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భద్రక్, జైపూర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+