Odisha train accident: ఒడిశాకు ప్రధాని మోదీ, బీజేపీ తొమ్మిదేళ్ల వేడుకలు రద్దు..!!

ప్రధాని మోదీ నేడు ఒడిశా వెళ్లనున్నారు. ముందుగా బాలాసోర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఆపై కటక్‌లోని ఆసుపత్రిని సందర్శిస్తారు. ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్గొంటుంది. క్షతగాత్రులకు భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంజ్, కటక్ లోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల అవ్వటంతో దేశ వ్యాప్తంగా వేడుకలు చేస్తున్న బీజేపీ ఈ రైలు ప్రమాదంతో వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఒడిషా రైలు ప్రమాదాలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంత్రి చెందారు. ఈ మేరకు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించారు. రైల్వే మంత్రితో మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధితులకు అవసరమైన సాయం మందించాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సహాయం పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ప్రధాని కాసేపట్లో ఘటనా స్థలికి చేరుకోనున్నారు.

odishatrainaccidentmodi

దాదాపు రెండు వేల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుకు చెందిన ప్రయాణీకులు ఈ రైల్లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదం పైన విచారణ చేస్తామని..ముందుగా సహాయక చర్యలపైనే ఫోకస్ పెట్టామని వెల్లడించారు.

1995 తరువాత ఇదే దేశంలో అతి పెద్ద రైల్వే ప్రమాదంగా నిర్దారించారు. ఈ దుర్ఘటనతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన వేళ నిర్వహిస్తున్న వేడుకలు..సభలను రద్దు చేస్తున్నట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది.

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్గొంటుంది. క్షతగాత్రులకు భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంజ్, కటక్ లోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపట్లో ఘటనా స్థలికి చేరుకోనున్నారు. అటు చెన్నై నుంచి మంత్రులు ఉదయనిధి స్టాలిన్,శివశంకర్ ,మహిష్ బాలాసోర్ చేరుకుంటున్నారు.

odishatrainaccident

ఘటనా స్థలిలో సహాయక చర్యలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యవేక్షించారు. బాధితులకు సహాయక చర్యల కోసం అన్ని శాఖల నుంచి సిబ్బంది రంగంలోకి దిగారు. ఏపీ నుంచి మంత్రి అమర్నాధ్ తో పాటుగా అధికారుల టీం బాలాసోర్ చేరుకుంది. హౌరా- భువనేశ్వర్ మార్గంలో అనేక రైళ్లను రద్దు చేసారు. పలు రైళ్లను దారి మళ్లించారు.

ప్రమాదంలో దెబ్బ తిన్న బోగీల నుంచి ప్రయాణీకులను వేరు చేస్తున్నారు. ఘటనా స్థలిలో పరిస్థితి భీతావాహంగా మారింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసారు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కోసం సిద్దం అయ్యాయి. ప్రధాని పర్యటన సమయంలో బాధితులకు అండగా మరిన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+