ఒడిశా రైలు ఘటన- కొడుకు బాడీ తీసుకెళ్దామని అంబులెన్స్ లో వస్తే- మార్చురీలో షాకింగ్..
ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల్ని రాజధాని భువనేశ్వర్ లోని మార్చురీలో ఉంచారు. దాదాపు వంద మృతదేహాల్ని ఇప్పటికీ వారి బంధువులు గుర్తించలేదు. దీంతో ఆయా మృతదేహాల ఫొటోల్ని రైల్వే అధికారులు సర్కులేట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి మృతదేహం కూడా ఈ ఫొటోల్లో ఉండటంతో అంబులెన్స్ లో ఒడిశా బయలుదేరి వచ్చాడు.
తన కుమారుడి మృతదేహాన్ని తీసుకునేందుకు సదరు తండ్రి నేరుగా మార్చురీకి వెళ్లాడు. అక్కడ మృతదేహాల్ని ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మృతదేహం కదులుతున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చి అక్కడికి వెళ్లాడు. చూడగానే అతను తన కొడుకే. అంతే కాదు అతను బతికే ఉన్నాడు. దీంతో సదరు తండ్రి షాకయ్యాడు. వెంటనే ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి తన కుమారుడి బాడీని మార్చురీ నుంచి బయటికి తెప్పించాడు.

బెంగాల్ లోని షాలిమార్ లో హెలారామ్ అనే వ్యక్తి తన 24 ఏళ్ల కుమారుడిని గత శుక్రవారం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కించాడు. కొద్దిగంటల్లోనే ఈ రైలు ప్రమాదానికి గురైందని తెలిసి హతాశుడయ్యాడు. కుమారుడికి ఫోన్ చేస్తే తన పరిస్ధితి ఏమీ బాగోలేదని, తీవ్ర గాయాలతో ఉన్నట్లు చెప్పాడు. దీంతో తండ్రి మరింత ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బెంగాల్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ కు బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే అంబులెన్స్ ను కూడా మాట్లాడుకున్నాడు. ఆస్పత్రులన్నీ వెతికినా తన కుమారుడు దొరకలేదు.
దీంతో స్ధానికంగా ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్చురీకి వెళ్లాడు. అక్కడ గుర్తించని మృతదేహాల్ని ఉంచారు. అందులో వెతికితే తన కుమారుడు దొరికాడు. వెంటనే అతన్ని స్ధానిక అధికారుల సాయంతో బాలాసోర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, ఆ తర్వాత కటక్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చివరికి అతను కోలుకుంటున్నాడు. అయితే ఒడిశా రైలు ప్రమాదం జరగ్గానే గాయాలతో సృహకోల్పోయిన అతన్ని చనిపోయినట్లుగా భావించిన స్ధానికులు అధికారులకు అప్పగించారు. దీంతో వారు కూడా చెక్ చేయకుండానే మార్చురీకి పంపినట్లు తెలిసింది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications