సీఎం సిద్దరామయ్యకు అదిరిపోయే కారు వస్తోంది, మంత్రులకు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలను కాంగ్రెస్ పార్టీ చిత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు కొత్త కార్లు కొనుగోలు చెయ్యడం అధికారులకు అలవాటు అయిపోయింది. మాకు ఈకార్లు కావాలి, మాకు ఆ కార్లు కావాలి అంటూ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర పరిపాలనా సంస్కరణల శాఖ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరికీ కొత్త కార్లను పంపిణీ చేసింది. సీఎం సిద్ధరామయ్య మినహా చాలా మందికి టయోటా ఇన్నోవా సిరీస్ ఎమ్‌పివిని అందించారు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఇన్నోవా కార్లు ఇవ్వడంతో అలిగారని సమాచారం.

ప్రస్తుతం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 2019 టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఇవ్వగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్, మంత్రులు ఎంబీ పాటిల్, జమీర్ అహ్మద్ ఖాన్‌లకు అత్యాధునిక టొయోటా ఇన్నోవా హిక్రాస్ ఎమ్‌పివిని అధికారులు అందించారు. ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో ప్రారంభించబడిన ఈ కొత్త కార్ల డెలివరీ కోసం చాలా కాలం క్యూలో వేచి చూస్తున్నారు.
కర్ణాటకలోని ఇతర మంత్రులందరికీ టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ఇచ్చారు. ఉద్యానవన శాఖ మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున్, పశుసంవర్ధక శాఖ మంత్రి కె. వెంకటేష్‌లకు ఇచ్చిన కొత్త కార్లు వారు ఇంకా తీసుకోలేదు. ముఖ్యంగా కొందరు మంత్రులు కొత్త కార్లను డిమాండ్ చేయగా, సీఎం సిద్ధరామయ్య కోసం ప్రభుత్వం త్వరలో సరికొత్త ఖరీదైన టొయోటా ఫార్చ్యూనర్ ఎస్ యూవీని కొనుగోలు చేయనుందని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ గురించి మాట్లాడుకుంటే, ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. స్టాండర్డ్ మరియు లెజెండ్. రూ.32.59 లక్షల నుండి రూ. 50.34 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉంది. ఎక్ట్సీరియర్ నుండి, ఈ ఫార్చ్యూనర్ దృష్టిని ఆకర్షిస్తుంది, క్యాబిన్ డిజైన్ చక్కగా ఉంది. ఇది ఏడు సీట్ల ఎంపికను కలిగి ఉంది,

ఇది ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, 360 పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జమీర్ అహమ్మద్, ఎంబీపాట్ లకు టయోటా ఇన్నోవా హిక్రాస్ ఎంపీవీ కారులు కొనుగులు చేశారు. మొత్తం మీద సీఎం సిద్దరామయ్య విలాసవంతమైన ఖరీదైన కారులో తిరుగుతూ పరిపాలన కొనసాగించడానికి సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications