Omar Abdullah: ఇంకా మీలో మీరే కొట్టుకోండి.. ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

Omar Abdullah: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోతోంది . ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీ 36 మార్క్ ను దాటి బీజేపీలో ముందంజలో ఉంది. ప్రస్తుతం కమలం పార్టీ 48 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. ఆప్ 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇండియా కూటమిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్, కాంగ్రెస్ లకు ఆయన చురకలు అంటించారు. ఢిల్లీలో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరించలేదని.. అందువల్లే ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిపోతున్నాయని మండిపడ్డారు. ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలానే ఉంటాయని.. రామాయణం వీడియోను ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

"ఇంకొంచెం పోరాడండి.. మీ మనసుకు నచ్చినంత వరకు పోరాడండి.. ఒకరినొకరు అంతం చేసుకోండి."అంటూ ఒమర్ అబ్దుల్లా ఘాటుగా మెసేజ్ పెట్టారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ ల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ప్రచార సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు వెనుకాడలేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఒమర్ అబ్దుల్లా కలసికట్టుగా లేకపోతే కూటమికి ముగింపు పలకాలంటూ ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

Omar Abdullah s Shocking Remarks on Delhi Election Results 2025

కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ లు వేర్వేరుగా పోటీచేశాయి. సెప్టెంబరులో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుంది. మొదట హర్యానాలో, తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ఒకదానికొకటి పోటీ పడ్డాయి. రెండు చోట్ల బీజేపీ లాభపడడం గమనార్హం. కాగా.. ఢిల్లీ ఎన్నికలకు ముందు కూడా ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి ఎంతకాలం మనుగడలో ఉంటుందనే దానిపై అయోమయం నెలకొందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+