దేశంలో ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. ఒక్క రోజులో 100కు పైగా కేసులు.. నైట్ కర్ఫ్యూపై కేంద్రం మార్గదర్శకాలు
ప్రపంచాన్ని మహామ్మారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గజగజలాడిస్తోంది. రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత్‌లో ఈ వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. కేసుల తీవ్రత పెరుగుతుడడంతో కేంద్రం అలెర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

ఒమిక్రాన్ విజృంభణ
దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 358కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే ఇప్పటి వరకు 100కు పైగా కేసులు నమోదు కావడంతో మరింత కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్ర 88, ఢిల్లీ, 67, తెలంగాణ 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22, ఓడిశాలో 4, హర్యానాలో 4, పశ్చిమబెంగాల్ 3, జమ్మూ కాశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, ఏపీలో 2, చత్తీస్‌గడ్, లఢక్, ఉత్తరాఖండ్‌లలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 114 మంది ఒమిక్రాన్ బారి నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన వారే అధికం..
ఈ ఒమిక్రాన్ లక్షణాలు ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కన్పిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరిని ఎయిర్ పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ వారికి నెగిటివ్ వచ్చినా.. ఇళ్లకు వెళ్లాక వారిలోని కొందరికి పాజిటివ్‌గా తేలుతోంది. అయితే అప్పటికే వారు తమ కుటుంబ సభ్యులను, స్థానికులను కలవడంతో ఒమిక్రాన్ వ్యాప్తికి మరో కారణమవుతోందని పేర్కొంటున్నారు. తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 33 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు
ఒమిక్రాన్ వ్యాప్తి క్రమేనా పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేసింది. అవసమైంతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

పండగల వేళ రాత్రి కర్ఫ్యూ..
మహమ్మారి ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు పండగల వేళ రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని కోరింది. కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది. వైరస్ బాధితుల నమూనాలను వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని సూచించింది.

ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం పెంచండి..
ఎప్పటికప్పుడు కరోనా టెల్టా, ఒమిక్రాన్ కేసులను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశం చేసింది. ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం పెంపతో పాటు అంబులెన్స్, మెడికల్ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించింది. ప్రజలు మాస్క్ లు , బౌతికదూరం పాటించేలా చూడాలని పేర్కొంది. వాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.












Click it and Unblock the Notifications