Pakistan: భారత గగన తలంలోకి పాక్ విమానం.. వెంటనే అప్రమత్తమైన వైమానిక దళం..
పాకిస్థాన్ కు చెందిన ఓ విమానం భారత గగన తలంలో కాసేపు ప్రయాణం చేసింది. భారీ వర్షం కారణంగా లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి అవకాశం లభించకపోవడంతో భారత గగనతలంలోకి ప్రవేశించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చెందిన బోయింగ్ 777 జెట్‌లైనర్ మే 4న ఫ్లైట్ PK-248 మస్కట్ నుంచి లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ లాహోర్ లో ల్యాండింగ్ చేయలేకపోయాడు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన ప్రకారంర విమానాన్ని కాసేపు గాల్లో తిప్పాలని సూచించింది. దీంతో పైలెట్ విమానాన్ని గాల్లో తిప్పే ప్రయత్నంలో భారత గగన తలంలోకి వచ్చారు. పాక్ విమానం భారత గగన తలంలోకి రాగానే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైందని, ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్‌ను భారత గగన తలంలోకి వచ్చినట్లు గుర్తించింది. పాక్ విమానం ఆ సమయంలో గంటలకు 292 కిలీమీటర్ల వేగం, 13,500 అడుగల ఎత్తులో అది ప్రయాణించింది.
బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్‌లోకి వచ్చింది. భారత పంజాబ్‌లోని తరన్ సాహిబ్ , రసూల్‌పూర్ ప్రాంతాల్లో దాదాపు 140 కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానాన్ని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉంచాడు పైలట్. ఏడు నిమిషాల పాటు విమానాన్ని అటు ఇటు తిప్పాడు. " వాతావరణం కారణంగా PIA విమానం భారత గగనతలంలో ఎగిరింది. దీనిపై లాహోర్, ఢిల్లీ ప్రాంత నియంత్రణల మధ్య సమన్వయం కుదిరింది" అని వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా విమానాల కదలికలను పర్యవేక్షించే వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న యాప్ ఫ్లైట్ రాడార్ 24లోని ట్రాకర్, PIA జెట్‌లైనర్ మే 4న భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే పంజాబ్‌లోని భిఖివింద్ పట్టణానికి ఉత్తరంగా రాత్రి 8.42 గంటలకు ప్రయాణించింది. అది నైరుతి వైపు తిరిగే ముందు టార్న్ తరణ్ నగరం మీదుగా ఎగిరి చివరికి భారత పంజాబ్‌లోని జాగియాన్ నూర్ మహమ్మద్ గ్రామం మీదుగా విమానం తిరిగి పాకిస్తాన్ చేరుకుంది.
ఆ తర్వాత పాక్ పంజాబ్‌లోని డొనా మబ్బోకి, ఛాంట్, ధుప్సారి కాసుర్, ఘఠి కలంజార్ ప్రాంతాల్లో ప్రయాణించి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. మళ్లీ మూడు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం భారత పంజాబ్‌లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ చేరుకుంది. ఈ సమయంలో విమానం 23,000 ఎత్తులో ప్రయాణించింది.












Click it and Unblock the Notifications