Diwali 2023: రాత్రి 8 నుంచి 10 గంటలలోపే టపాసులు కాల్చుకోవాలట..

దీపావళి(Diwali) అనగానే మనకు ఏం గుర్తుకు వస్తుంది. పిండి వంటలు, పూజలు గుర్తుకు వస్తాయి. ఇంక అంటే.. ఆ.. టపాసులు(Krakars) కాల్చడం ఉంటుంది. దీపావళి రోజు సాయంత్రం కాగానే బాణాసంచ కాల్చడం జరుగుతోంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే టపాసులు కాల్చడం వల్ల వాతావరణం కాలుష్యానికి గురవుతోంది. అయినప్పటికీ చాలా మంది బాణాసంచ కాలుస్తుంటారు. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దీపావళికి పటాకులు కాల్చాలనుకునే వారికి షరతులు విధించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు వరకు మాత్రమే టపాసలు పేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మధ్యే అత్తిబెలెలోని ఓ క్రాకర్ గోడౌన్ లో ప్రమాదం జరిగిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రాకర్ గోడౌన్ జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పర్యావరణానికి హాని కలగకుండా క్రాకర్స్ తయారు చేయాలని కోరింది.

On the occasion of Diwali, Krakars should be burnt between 8 and 10 pm in Karnataka.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కల్గించని క్రాకర్స్ ను అమ్మాలని, వాటిపై ఆకుపచ్చ అని రాసి ఉన్న వాటిని విక్రయించాలని స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కేఎస్‌పీసీబీ) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు పేల్చేందుకు రెండు గంటల నిబంధనను అమలు చేయాలని పురపాలక శాఖ అధికారులు, పౌర సంస్థలు, కార్పొరేషన్‌లకు ఆదేశారు జారీ చేశారు.

సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాన్-గ్రీన్ పటాకులను నిషేధిస్తూ అక్టోబర్ 2018 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు ఢిల్లీలో పటాకులు కాల్చడం పూర్తిగా నిషేధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+