డమ్ డమ్ కంటోన్మెంట్ రైల్వేలైన్‌లో పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, 10క్రూడ్ బాంబులు సీజ్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా డమ్ డమ్ కంటోన్మెంట్ రైల్వే లైన్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఘటనా స్థలంలో 10 క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా పోలీసులతోపాటు రైల్వే పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలావుంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని, బీజేపీ, కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లను కూడా వేసుకోకుండా టీఎంసీ అడ్డుకుంటోందని ఆరోపించాయి.












Click it and Unblock the Notifications