గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్రగాయాలు, మృతి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నై నగరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిపోవడంతో ఒకరు మృతి చెంది ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. చెన్నైలోని ముత్తమిజ నగరలోని కోడంగయ్యూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకట ప్రకాష్ (55) అనే ఆయన భార్య గీతా (45) మరణించారు.

వెంకట ప్రకాష్, ఆయన కుమార్తె షర్మిల (25), కుమారుడు కిశోర్ (22) లకు తీవ్రగాయాలై ప్రభుత్వ కీలపాక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు చెప్పారు. వెంకట ప్రకాష్ పెరంబూరులోని ఐసీఎస్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు.

One killed as Chennai house collapses in cylinder blast

వెంకట ప్రకాష్ కుమార్తె షర్మిల ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కిశోర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వెంకట ప్రకాష్ బార్య గృహిణి. ఆదివారం ఉదయం వెంకట ప్రకాష్ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఇల్లు కుప్పకూలింది.

విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం వెంకట ప్రకాష్ భార్య గీతా మరణించారని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four persons, all hailing from the same family, sustained severe injuries when their house partly collapsed unable to bear the impact of a LPG cylinder blast on Sunday. One of them died this morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి