పనిలేక ఇంట్లో కూర్చున్న ఎమ్మెల్యేలు: 'ఢిల్లీ'పై సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో శాసన సభను సుప్తాచేతనావస్థలో ఉంచడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు పని లేకుండా కూర్చోవాలా అని ప్రశ్నించింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
శాసన సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏం పని లేకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి ఒకరు ఢిల్లీ శాసన సభ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఢిల్లీ శాసన సభ పైన ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రానికి నోటీసులు పంపించింది.

ఒక పార్టీ తమకు సంఖ్యాబలం లేదని చెబుతోందని, ఇంకో పార్టీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెబుతోందని, ఇంకో పార్టీకి సంఖ్యా బలం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించింది. ఫిబ్రవరిలో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసినప్పటి నుండి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.
ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏం పని లేకుండా, ఇంటికి పరిమితం చేసి, శాసన సభను సుప్తాచేతనావస్థలో ఎందుకు ఉంచారని, ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications