విషవాయువు లీక్- ఒకరు మృతి : 13 మందికి ఆస్పత్రిలో చికిత్స..!!
తమిళనాడులోని ఈరోడ్‌లో ఉన్న రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. క్లోరిన్ వాయువు లీకై ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. చిటోడే ప్రాంతంలో దామోదరన్ అనే వ్యక్తి ఓ లిక్విడ్ క్లోరిన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అయితే ఓ సిలిండర్‌లో క్లోరిన్ వాయువును నింపుతుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై దామోదరన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
అందులో 13 మంది స్పృహ కోల్పోయారు.వెంటనే ఘటనాస్థలికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనకు చేరుకున్న పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. గతంలో ఏపీలోనూ ఇటువంటి రసాయన పరిశ్రమల్లో చోటు చేసుకున్న లీకేజీల కారణంగా అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనలో అనేక మంది విష వాయువుతో నిలబడిన వారు అలాగే కుప్పకూలిపోయారు.

పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో..ఏపీ ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లించి... సంస్థను సీజ్ చేసారు. అక్కడ నుంచి సంస్థను తరలించారు. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇదే రకమైన విష వాయువు లీకు కావటం వలనే అనేక మంది ఇబ్బంది పడ్డారు. కరోనా సమయంలో ఆ ఘటన చోటు చేసుకోవటంతో మరింత ఆందోళన వ్యక్తం అయింది. అయితే, ఆ తరువాత చికిత్స ద్వారా కాలుష్యం కారణంగానే వారంతా అస్వస్థతకు గురయ్యారని తేల్చారు. ఇక, ఇప్పుడు ఈరోడ్ లో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించగా.. మిగిలిన 13 మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారని..వారికి ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications