తాజ్‌మహల్ సందర్శన: రోజూ 40 వేల మంది ఇండియన్లకు అనుమతి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితిని విదించింది. ప్రతి రోజూ 40 వేల మంది భారతీయ పర్యాటకులు మాత్రమే తాజ్‌మహల్‌ను సందర్శించేలా నిబంధనలు విధించారు.

విదేశీ పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలను మాత్రం విధించలేదు ఈ నెల 20వ , తేది నుండి ఈ నిర్ణయాన్ని అమల్లోకి రానుంది కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.

Only 40,000 Indian Tourists Will be Allowed in Taj Mahal Per Day

తాజ్‌ మహల్‌ పరిరక్షణపై పారా మిలటరీ, ఏఎస్‌ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపింది. ఈ సమావేశం తర్వాత కేంద్ర పర్యాటక శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకొంది. తాజ్‌ను వీక్షించే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ ప్రపంచ వారసత్వ కట్టడాన్ని సంరక్షించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఇతర రక్షణ చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

మరో వైపు తాజ్‌మహల్ లోపలికి వెళ్ళేందుకు 15 ఏళ్ళ లోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. అయితే 15 ఏళ్ళు దాటిన వారికీ మాత్రం టిక్కెట్టు చెల్లించాల్సిందే. ప్రతి రోజూ 40 వేల మంది ఇండియన్ టూరిస్టులకు టిక్కెట్లు జారీ చేస్తారు.

విదేశీ టూరిస్టులకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. ముంతాజ్ సమాధిని సందర్శించేందుకు రూ.100 చెల్లించి టిక్కెట్టును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The number of Indians visiting Agra’s Taj Mahal has been capped to 40,000 per day. The decision was taken on Tuesday in a meeting attended by senior bureaucrats. .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి