గడ్డం పెరుగుతోంది, స్టేడియాలకు పేర్లు, స్పేస్‌కు ఫోటో.. మోడీపై దీదీ నిప్పులు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ- టీఎంసీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రేపు ఉదయం బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీదీ విమర్శలు సంధించారు.

టీఎంసీ ఇతరులతో కలిసి బీజేపీపై విరుచుకుపడుతోంది. ఢిల్లీ, గుజరాత్, యూపీలో బీజేపీ ఏం చేసిందో అందరికీ తెలుసు అని దీదీ అన్నారు. పరిశ్రమల అభివృద్ధి తగ్గిపోయిందని.. దీనికి ఎవరూ కారణమో అందరికీ తెలుసు అని చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం మాత్రం పెరుగుతుందని దీదీ సెటైర్లు వేశారు. కొన్ని సందర్భాల్లో మోడీ.. రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీ, స్వామి వివేకానంద కన్నా ఎక్కువగా భావిస్తారని చెప్పారు.

Only Grows Beard, Names Stadium After Himself: Mamata Banerjee On PM

అందుకోసమే ఆయన పేరును స్టేడియాలకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అన్నింటిపై మోడీ పడిందో.. ఇక ఆయన దేశాన్ని అమ్మేస్తారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మోడీకి పిచ్చి పట్టిందా అనిపిస్తోందని పేర్కొన్నారు.

స్టేడియాలకే కాదు.. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై కూడా మోడీ పేరు ఉంటుందని దీదీ విమర్శించారు. దీనిని బట్టి చూస్తే దేశం పేరు కూడా మారే ప్రమాదం ఉంది అని మమతా ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు మోడీ ఫోటోను ఇస్రో అంతరిక్షంలోకి పంపించాలని కూడా కోరతారని విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+