జమిలిపై జేపీసీ- సాయిరెడ్డికి చోటు: జగన్ చక్రం తిప్పుతారా..?!
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా అడుగు ముందుకు పడింది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. 27 మందితో ఇదివరకే లోక్‌సభ జేపీసీ ఏర్పాటైంది.
ఇప్పుడు తాజాగా రాజ్యసభ జేపీసీ కూడా ఏర్పాటైంది. మొత్తం 12 మంది సభ్యులకు ఇందులో చోటు దక్కింది. రాజ్యసభ సభ్యులు ఘన్‌శ్యామ్ తివారీ- బీజేపీ, భువనేశ్వర్ కలిటా- బీజేపీ, తెలంగాణ నుంచి డాక్టర్ కే లక్ష్మణ్- బీజేపీ, కవిత పటిదార్- బీజేపీ, సంజయ్ కుమార్ ఝా- జనతాదళ్ (యునైటెడ్) ఇందులో ఉన్నారు.

ప్రతిపక్షాల కూటమి నుంచి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా- కాంగ్రెస్, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్- కాంగ్రెస్, సాకేత్ గోఖలే- తృణమూల్ కాంగ్రెస్, పీ విల్సన్- డీఎంకే, సంజయ్ సింగ్- ఆమ్ ఆద్మీ పార్టీలకు చోటు దక్కింది. జాతీయ రాజకీయాల్లో తటస్థ పార్టీలుగా గుర్తింపు పొందిన బిజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మానస్ రంజన్ మంగరాజ్, వీ విజయసాయిరెడ్డిలను జేపీసీలోకి తీసుకున్నారు.
కాగా- బీజేపీతో పాటు వైఎస్ఆర్సీపీ, బిజూ జనతాదళ్.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా ఈ రెండు పార్టీలు కూడా అనుకూలంగా ఓటు వేశాయి. కాంగ్రెస్ సహా, ఆ పార్టీ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా బ్లాక్ దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది.
ఈ పరిణామాల మధ్య బీజేపీ, కాంగ్రెస్, తటస్థ పార్టీలకు చెందిన సభ్యులతో రాజ్యసభ జేపీసీ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జమిలి ఎన్నికలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనంటూ విజయసాయిరెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని తెలియజేసిన నేపథ్యంలో దీనికి అనుకూలంగా సిఫారసు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలు, సలహాలను అందజేస్తుంది. దానికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఇది అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications