దిల్లీ బ్లాస్ట్.. పాక్ కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్..
భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు.. వారికి స్పాన్సర్ చేసే వారిని భారత్ ఒకే విధంగా చూస్తుందని తెలిపారు. టెర్రరిస్టులను ప్రోత్సహించే వారుకూడా టెర్రరిస్టులేనని స్పష్టం చేశారు. ఎలాంటి బ్లాక్ మెయిల్ వ్యవహారాలకు భారత్ భయపడదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. పాకిస్థాన్ తో భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ.. పాకిస్థాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాకిస్థాన్ తో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్ లాంటి దేశాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. చర్చలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఒకేసారి జరగవని తెలిపారు. పాకిస్థాన్ శాంతియుత ప్రక్రియను అలవరుచుకోవాలని అందుకు భారత్ కూడా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
"ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. ఇది 88 గంటల పాటు సాగింది. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ఏ క్లిష్టపరిస్థితిపైనా భారత్ సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. పాకిస్థాన్ అవకాశం ఇస్తే.. సరిహద్దు దేశంతో ఎలా నడుచుకోవాలో ఆ దేశానికి వివరిస్తాం" అని భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు. పాకిస్థాన్ లాంటి ఉగ్రవాద ప్రోత్సాహ దేశంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్.. పురోగతి, అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలిపారు. తమ దారికి అడ్డొస్తే వారిపై చర్యలు ఎలా తీసుకోవాలో తమకు తెలుసని స్పష్టంచేశారు.

ఇక నవంబర్ 10 సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాాయపడ్డారు. ఈ ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసింది. ఇక ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఎర్రకోట సమీపంలో కారు పేలుడుకు కుట్ర పన్నిన నిందితుడిగా భావిస్తున్న అమీర్ రషీద్ అలీని అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. తాజాగా దిల్లీ కోర్టు అలీని 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications